Movies

పెళ్లి చేసుకున్న బొమ్మరిల్లు భామ జెనీలియా గుర్తు ఉందా… ఇప్పుడు ఏమి చేస్తుందో?

టాలీవుడ్ కి ఎందరో హీరోయిన్లు పరిచయం అవుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది వున్నారు. అందులో జెనీలియా డిసౌజా ఒకరు. ఈమె బాయ్స్ మూవీతో దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చి,ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. ముంబయికి చెందిన ఈ స్లిమ్ బ్యూటీ తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించింది. సత్యం, సాంబ, రుక్మిణి కళ్యాణం, హ్యాపీ, సై,బొమ్మరిల్లు,ఢీ,రెడీ వంటి పలు చిత్రాలతో ఈమె అందరినీ అలరించింది.ఇందులో బొమ్మరిల్లులో హాసిని పాత్ర జెనీలియా సినీ లైఫ్ లో ఆణిముత్యం లాంటి మూవీ అని చెబుతారు క్రిటిక్స్ .హిందీ,కన్నడ,తమిళం చిత్రాల్లో కూడా నటించిన ఈ క్యూట్ గాళ్ తొలిచిత్రం తుజే మేరీ కసమ్. తెలుగులో నువ్వే కావలి మూవీకి రీమేక్ ఇది.

ఇక అప్పట్లోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో కల్సి పార్కర్ పెన్ యాడ్ లో జెనీలియా నటించడం సెన్సేషన్ అయింది. అందుకే ఆ యాడ్ తర్వాత ఎవరీ అమ్మాయి అంటూ అందరూ ఆరా తీయడం స్టార్ట్ అయింది. ఆ విధంగానే తుజే మేరీ కసమ్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. 1987ఆగస్టు 5న జన్మించిన జెనీలియా తండ్రి పేరు నీల్ డిసౌజా, తల్లి పేరు జెనెటా డిసౌజా.

పోస్టరో స్కూల్, సెయింట్ అనస్ కాలేజీలో విద్యాభాస్యం చేసిన జెనీలియా డిగ్రీ చదువుతుండగానే మొదటి చిత్రం అవకాశం వచ్చింది. ఇక అదే ఏడాది అంటే 2003లో తమిళంలో బాయ్స్ చిత్రంతో అడుగుపెట్టింది ఇక సత్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

అయితే తుజే మేరీ కసమ్ తోనే వెండితెరకు పరిచయం అయిన హీరో రితేష్ దేశముఖ్ తో ఆనాటినుంచి ఇద్దరి మధ్యా బంధం బలపడి అది ప్రేమగా మారింది. ఇక పెళ్ళికి దారితీయడం,ఇరు కుటుంబాలు అంగీకరించడం వంటి పరిణామాలతో 2012లో రితేష్, జెనీలియా మ్యారేజ్ చేసుకున్నారు.
ఇక జెనీలియాకు రియాన్ ,రాయల్ అనే ఇద్దరు కుమారులున్నారు.

భర్త ఎంత ఎంకరేజ్ చేసినా సరే, పెళ్లయ్యాక కొన్నాళ్ల వరకూ జెనీలియా ఇండస్ట్రీ గడప తొక్కలేదు. అయితే పిల్లలు కాస్తంత ఎదిగాక,మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అది కూడా గెస్ట్ అప్పియరెన్స్ క్యారెక్టర్లు తప్ప, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేయడం లేదు. జై హో,ఫోర్స్ టు అనే హిందీ మూవీస్ తో పాటు లాయి భారీ అనే మరాఠీ మూవీలో నటించింది.

ఇటీవలే భర్త రితేష్ పుట్టినరోజు సందర్బంగా కోట్లు ఖర్చుచేసి,టెస్ట్ లే ఎలక్ట్రిక్ కారును ప్రెజెంట్ చేసింది. భారత్ లో ఇలాంటి కారుని ఓ బిజినెస్ మ్యాన్ కొనుగోలు చేయగా, రెండవది జెనీలియా తన భర్తకు కానుకగా కొనిచ్చింది. కాగా ఇతర భాషల్లో క్యారెక్టర్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధం అంటోది జెనీలియా.