Politics

పవన్ కళ్యాణ్ ని అభిమానులే నమ్మడం లేదా? షాకింగ్ సర్వేలో నమ్మలేని నిజాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు దూరంగా జరిగి, రాజకీయ పార్టీ జనసేనను పటిష్టం చేయడానికి ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై స్పందిస్తున్నారు. జిల్లా యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అయితే తన యాత్ర సాగుతున్న సమయంలోనే సమాంతరంగా ఓ రహస్య సర్వే కూడా ఆయన చేయిస్తున్నారట. నిజానికి ఈ సర్వే చూసాక పవన్ కి చికాకు కలిగిస్తున్నాయట. కలవరపాటుకు గురిచేస్తున్నాయట. పార్టీ వర్గాల నుంచి కూడా అందుకు అనుగుణంగా సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా తన అభిమానులే తనని నమ్మడం లేదట. తాను పర్యటించిన జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేను నాలుగు విభాలుగా విభజించి నిర్వహించారట. 18నుంచి 30ఏళ్ళ వయస్సు వరకూ ఓ కేటగిరీ,30నుంచి 45మధ్య వయసున్న వాళ్ళను రెండో వర్గంగానూ,ఆపై వయస్సు వారందరూ ఇంకో వర్గంగానూ,ఇక అర్బన్ ,రూరల్ ఓటర్లు అనే విభాగంగా వెరసి నాల్గు విభాగాలుగా సర్వేను చేయించినట్టు బోగట్టా.

ఇందులో 18 నుంచి 30 ఏళ్ళ వయస్సు వారిలో 60 శాతం మంది పవన్ ఆలోచనలకు అనుకూలంగా ఉన్నాగానీ,అయన రాజకీయ విధానాలపై అనుమానం పడుతున్నారట. సినిమా పరంగానే కాకుండా సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు రిపోర్ట్ లో తేలింది. ఇక 30నుంచి 45మధ్య వయసున్న వాళ్ళ ను వాకబు చేస్తే,ఇందులో కేవలం 30శాతం మంది మాత్రమే పవన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు తెల్సింది.

ఇక పవన్ ని వ్యతిరేకించేవారిలో ఎక్కువమంది అభిమానులే ఉన్నారట. పవన్ కూడా ఆయన అన్న చిరంజీవిలా చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారట.ఇక 45ఆ పైబడినవారిని కదిలిస్తే, కేవలం 10శాతం మంది మాత్రమే పవన్ కి మద్దతు ఇస్తున్నట్లు తేలిందట.ఇక మిగిలినవారంతా సినిమా వారిని ఇప్పట్లో నమ్మేస్థితిలో లేమంటూ తెల్చిపారేశారట. ఈమేరకు పవన్ కి నివేదిక అందించారట సర్వే టీమ్.

అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని అంటున్నా, ముందస్తు తప్పదేమోననే సంకేతాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జనసేన పటిష్టానికి ఉపకరిస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపించే లోగా అన్నివర్గాలను ఆకట్టుకునేలా చర్యలు చేపడితే పార్టీకి మైలేజి వస్తుందని జన సైనికులు నమ్మకంగా వున్నారు. ఇప్పటికే యువత దృష్టి జనసేన మీద ఉన్నందున ఇక పెద్దవాళ్లపైనే కేంద్రీకరించాలని భావిస్తున్నట్టు తెల్సింది.