Movies

పూజా హెగ్డే బ్యాక్ గ్రౌండ్ ఏమిటి …ఆమె ఎవరి కూతురో తెలుసా?నమ్మలేని నిజాలు

నాగ చైతన్య హీరోగా వచ్చిన ఓకే లైలా కోసం మూవీతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజా హెగ్డే పలు మూవీలో నటించింది. దువ్వాడ జగన్నాధంతో స్టార్ డమ్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2012లో తమిళంలో మూగ ముడి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజా హెగ్డే ఆరేళ్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు,తమిళ భాషల్లోనే కాదు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోల సరసన నటించిన పూజా,ఇటీవల తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ పక్కన జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కుర్రకారుని ఫిదా అయ్యేలా చేసింది. నిజానికి 2017వరకూ స్లో గా సాగిన ఈమె కెరీర్ దువ్వాడ జగన్నాధంతో వేగం పుంజుకుంది.

2012నుంచి 2017వరకూ కేవలం 3చిత్రాలే చేసిన పూజ, 2018లో 3, 2019లో 4సినిమాలు చేస్తోందంటే ఆమె రేంజ్ ఏస్థాయికి చేరిందో చెప్పక్కర్లేదు.ముంబయిలో 1990 అక్టోబర్ 13న జన్మించిన పూజా తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే కర్ణాటక నుంచి ముంబయి వెళ్లి స్థిరపడ్డారు. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు.

దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. ముంబయి ఎం ఎం కాలేజీలో చదివిన పూజా, 2010లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ గా నిలవడంతో మోడలింగ్ ఛాన్స్ లు వరించాయి.పలు మోడలింగ్ లలో పనిచేస్తున్న సమయంలో తమిళంలో మూగమూడి చిత్రం లో ఛాన్స్ రావడంతో ఆనందంతో ఒప్పుకుంది. ఇక తెలుగులో ఒక లైలా కోసం మూవీలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అందుకే మెగా హీరో వరుణ్ తేజ్ మొదటి చిత్రం ముకుంద లో కూడా ఆమె హీరోయిన్. హిందీలో హౌస్ ఫుల్ ఫోర్ మూవీలో చేస్తున్న ఈ మంగుళూరు భామ, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత లో నటిస్తోంది. మరో మూడేళ్ళ దాకా పూజా డేట్స్ ఖాళీ లేనంతగా ఎదిగింది. ఇక ప్రభాస్ హీరోగా వచ్చే తదుపరి మూవీలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."