Politics

సంచలన నిర్ణయం తీసుకున్న రోజా….షాక్ లో జగన్

సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి అగ్ర నటుల సరసన నటించి, లేడీ కీ రోల్ సినిమాలు కూడా చేసిన రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వుంటున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్రపడిన రోజా,అధికార టిడిపి నేతలను హడలెత్తించే విధంగా మాట్లాడడంలో దిట్ట. ఇక ముఖాముఖిలో సైతం సూటిగా, స్పష్టంగా మాట్లాడడంలో రోజాకు రోజాయే సాటి. ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడ్డం ఆమె నైజం. అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న రోజా ఏనాడు పరిస్థితులకు తలొంచలేదు. సినిమాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ గల రోజా రాజకీయాల్లోనూ అభిమానాలను సంపాదించుకున్నారు.
Roja – MLA from Nagari Constituency
ఇక ఇటీవల ఓ సర్వేలో ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో రిపోర్ట్స్ రావడంతో వైస్సార్ సిపిలో కూడా ఆమెపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే 2019ఎన్నికల్లో జగన్ కి ప్రతిసీటు కీలకమే. అందుచేత ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఒక్క సిటింగ్ ఎమ్మెల్యే ఓడిపోయినా అది జగన్ కి పెద్ద దెబ్బ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలాగైనా గెలవాలన్న కసితో రోజా రంగంలోకి దిగింది.

ఆ సర్వే ఒక బూటకమని, ఈ విషయం వచ్చే ఎన్నికల్లో తన గెలుపే చెబుతుందని చెప్పుకొచ్చారు.ఈ నేపధ్యంలో తన సొంత నిధుల నుంచి మండలంలోని ఓ స్కూల్స్ అన్నింటికీ ఫ్యాన్లు అందజేసింది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు కావాలన్నా వెంటనే నిధులు అందిస్తోంది. ఆవన్నీ ఆమె సొంత డబ్బులేనట. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవాలని అందుకు తనవంతుగా తన సీటులో గెల్చి కానుకగా ఇవ్వాలని కృతనిశ్చయంతో వుంది.

పార్టీలో వ్యతిరేకులందరీ కలుసుకుని వారిని బుజ్జగించడంలో సఫలం అయింది. ఇక టిడిపి అభ్యర్ధితోనే అమీ తుమీ తేల్చుకోవాల్సి వుంది. పైగా ఇక్కడ టిడిపికి బలమైన క్యాండెట్ లేకపోవడం రోజాకు కల్సి వచ్చే అంశం. మరి రోజా సొంత నిధులతో నియాజకవర్గంలో చేస్తున్న పనులు చూసి జగన్ ఆశ్చర్యపోతున్నారట. అందుకే రోజాను ఆదర్శంగా తీసుకుని ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."