Politics

తమ్ముడు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్…ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చిత్రసీమను తన ఛరిష్మాతో శాసించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా ఏమాత్రం వన్నెతగ్గకుండా అభిమానులను అలరిస్తున్నాడు. తనను ఇంత వాడిని చేసిన అభిమానులకు, ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లో చేరి, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే పరిస్థితుల కారణంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. రాజకీయాల్లో లోటుపాట్లు తెల్సిన చిరు, తాను ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన పార్టీని చివరకు కాంగ్రెస్ లో విలీనం చేసారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో వున్నా, ఈమధ్య అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.ఇక చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, ఇతర పార్టీలకు తానె ప్రత్యామ్నాయం అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. అప్పుడు ప్రజారాజ్యంలో చిరు వెంట నడిచిన వాళ్లలో చాలామంది ఇప్పుడు పవన్ గూటికి చేరుతున్నారు.

ఇక చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మెగా వర్గాల ద్వారా జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో చురుగ్గా లేకున్నా , సభ్యత్వం మాత్రం వుంది. 2019ఎన్నికల దాకా రాజకీయాల్లో కొనసాగాలని కూడా భావించిన చిరు కి ఎపి కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి ఎంపిక చేయాలని కూడా ఆ పార్టీ పెద్దలు భావించినట్టు వార్తలు వచ్చాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమౌతుందో ఏమో అన్నట్లుగా ఉన్నట్టుండి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అదికూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే అప్పగిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు, అందుకే ఆయన కాంగ్రెస్ లో తిరిగి చేరినట్లు బోగట్టా. అయితే ఈ పరిణామం చిరంజీవిని బాధపెట్టిందని అంటున్నారు. ఎపి కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే, బాధ్యతగా పనిచేసి, తాను ఏమిటో నిరూపించాలని భావించినా సరే,కిరణ్ కుమార్ రెడ్డి మధ్యలో దూరడం తో కొత్త సమీకరణలకు తెరలేపారు.

దీంతో చిరంజీవి కాంగ్రెస్ ను వదిలేసి, తమ్ముడు పవన్ పెట్టిన జనసేనకు తన అనుభవాన్ని జోడించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. అంతేకాకుండా పవన్ ఒంటరి పోరు సాగిస్తుండడం, అతనికి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదనే వార్తలు రావడం చిరు దృష్టికి వచ్చిందట. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ కి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాడట. ఇక చిరు ఎంటర్ అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్లుగా పవన్ కి లభిస్తుందని అంటున్నారు. అసలు ఈ వార్త తెరపైకి వచ్చాక పవన్ అభిమానుల్లో ఆనందం పెల్లుబికుతోంది. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."