Politics

పవన్ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్న రేణు కామెంట్స్…ఏమి చేస్తాడో మరి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను దూరం పెట్టి, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాడు. యాత్రల పేరిట జిలాల్ల్లో సందడి చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో ఈ గబ్బర్ సింగ్ తనదైన రాజకీయం చేస్తూ, జనంతో మమేకం అవుతున్నాడు. ఇక ఆంధ్రలోని మరి కొన్ని జిల్లాల్లో జనసేన కవాతుకి రంగం సిద్ధం చేస్తున్నాడు. యాత్రకు జనం వస్తున్నా, పోలింగ్ దగ్గరకొచ్చాక ఇది ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టమే. పవన్ ఎఫెక్ట్ టిడిపి, వైసిపిలో ఎవరిపై ఎక్కువ పడుతుందో ఎవ్వరూ తేల్చలేరు. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభావం అసలు ప్రభావం ఉంటుందా ఉండదా , ఒకవేళ ఎలా వున్నా,ప్రస్తుతం మాత్రం పవన్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.

నిజానికి ఓ పార్టీ పెట్టి, ఎన్నికల రణరంగంలోకి దిగడం ఆషామాషీ వ్యవహారం కానేకాదు. పైగా గతంలో చేసిన తప్పిదాలు, పొరపాట్లు అన్నీ బయటకొస్తాయి. ఇప్పుడు పవన్ విషయంలో అదే జరుగుతోందనే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ మీద విమర్శలు అంటూ చేయాల్సి వస్తే, వ్యక్తిగత జీవితమే టార్గెట్ అవుతూ ఉంటుంది.

ఇక ఆయన మూడు పెళ్లిళ్లు ఎప్పుడూ వివాదాస్పదమే. విమర్శలకు కేంద్ర బిందువే. ఇక ఎన్నికల సీజన్ మొదలయ్యాక ప్రస్తుత స్థితిలో ఆయన ట్రిపుల్ మ్యారేజెస్ తిప్పలు పెట్టేలా వున్నాయి.పవన్ రెండో భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక చాలాకాలం సైలెంట్ గా వున్నప్పటికి ప్రస్తుతం కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

దీనికంతటికీ పవన్ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ప్రధాన కారణం. అయితే గతం సంగతి అయినప్పటికీ ఇటీవల ఆమె మరో పెళ్ళికి సిద్ధపడిన నేపథ్యంలో ఆమె మాటలు పవన్ ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. నిజానికి వీళ్ళిద్దరూ బాహాటంగా విడిపోయి, డైవర్స్ కూడా తీసేసుకోవడంతో వీరి వ్యవహారం వివాదం కానేకాదు. అయితే పవన్ మూడో భార్య సంతానం గురించి చెప్పడంతోనే మొదలైంది.

పవన్ ని తూర్పార పడుతూ టిడిపికి సపోర్ట్ గా వుండే ఓ ఛానల్ లో రేణు తన బాధను వెళ్లగక్కారు. తనకు విడాకులు కూడా ఇవ్వకుండానే పవన్ మరో బిడ్డకు తండ్రి అయ్యాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇది కొంత డామేజ్ అంశమే కావడంతో సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరిగింది. ఇక తాజాగా మరిన్ని వివరాలు రేణు పిఆర్ టీమ్ మరిన్ని వివరాలు బయట పెట్టింది.

డేట్లతో సహా పవన్ తప్పులను ఎత్తిచూపే యత్నం చేసింది. 2012మార్చి13న పవన్ మూడో భార్య లేజానోవాకి పోలేనా పుట్టిందని ఫేస్ బుక్ లో చెప్పిన రేణు టీమ్, మార్చి 16న పవన్ ,రేణుల విడాకులు జరిగాయని గుర్తు చేసింది. అయితే రేణు భార్యగా ఉండగానే ఏడాది క్రితం నుంచి లేజనోవా గర్భవతిగా ఉందన్న మాట. ఇలా ఒకరితో చట్టబద్ధమైన వైవాహిక జీవితంలో ఉంటూ,మరొకరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం తప్పు, నేరం కూడా అవుతుంది.

ఈ విషయంలో గతంలో ఎప్పుడూ రేణు బయటపెట్టకపోయినా అదను చూసి బయట పెట్టడం ఆసక్తికరమే కాదు ఆందోళనకరమే. ఎంతలేదన్నా ఎన్నికలకు ముందు ఇలాంటి విషయాలు పవన్ ఇమేజ్ ని డామేజ్ చేస్తాయనే చెప్పాలి. అయితే ఓట్ల రూపంలో ఎంతమేరకు నష్టం వాటిల్లుతోంది ప్రస్తుతానికి సస్పెన్స్ .ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.