సీనియర్ నటుడు వినోద్ చనిపోయి ఒక రోజు కూడా కాలేదు…అయన కొడుకు చేసిన పని తెలిస్తే కనీళ్ళు ఆగవు
పుట్టిన వాడు మరణించక, మరిణించినవాడు పుట్టక తప్పదు అన్నది నిజమే అయినా,ఇంకా వయస్సు ఉండగానే హఠాన్మరణం చెందితే వారి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోవడం సహజం. సరిగ్గా నటుడు వినోద్ విషయం తీసుకుంటే అదే జరిగింది. శనివారం తెల్లవారుఝామున ఈయన హఠాన్మరణం చెందారు. అరిశెట్టి నాగేశ్వరరావు అలియాస్ వినోద్ సీనియర్ నటుడు. ఎన్నో వందల సినిమాల్లో నటించారు. అరిశెట్టి నాగేశ్వర రావు అంటే షార్ట్ కట్ లో ఏ ఎన్ ఆర్ అని వస్తుండడం అప్పటికే అక్కినేని పెద్ద నటుడిగా ఉండడంతో వినోద్ గా సినిమాల్లో పేరు మార్చుకున్నారు.
క్యారక్టర్ నటుల్లో ఒకరైన వినోద్ తెలుగు, తమిళం, మలయాళం,సినిమాల్లో నటించి మెప్పించడమే కాదు బుల్లితెర మీద కూడా తన హవా సాగించారు.
నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడైన వినోద్, సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ,మోహన్ బాబు ఇలా అందరితో ఎంతో సన్నిహితంగా మంచిగా మెలిగారు. దివంగత డాక్టర్ దాసరి నారాయణరావు ఈయనకు గాడ్ ఫాదర్ లాంటి వారు. కొద్ది రోజులుగా సినిమాలు తగ్గించి ఫామిలీ లైఫ్ ని బాగా ఎంజాయి చేస్తున్న వినోద్ ఒక్కసారిగా 59 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోవడం ఆయన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేసింది.
కనీసం ఏ చిన్న అనారోగ్య సమస్య లేకపోయినా వినోద్ మరణించడం తో భార్య వీణావతి, కొడుకు సురేష్,కూతుళ్లు తేజస్విని,శిరీష,లు కుప్పకూలిపోయారు. ఇంత బాధ వెంటాడుతున్న ఆయన కొడుకు ఓ పనిచేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఆసుపత్రికి వినోద్ భౌతిక కాయాన్ని తీసుకెళ్లి , తన తండ్రి అవయవాల్లో బాగున్నవి తీసుకుని, అవయవాలు లేనివారికి అమర్చమని చెప్పాడట కొడుకు సురేష్. దీనికి భార్య, కూతుళ్లు కూడా ఎంతో ఆనందించారు.
భౌతికంగా లేకున్నా అవయవ దానంతో పదిమందిని బతికించడం నిజంగా గొప్ప విషయమని పలువురు కొనియాడారు. కొడుకు చేసిన పనికి భార్య ,కూతుళ్లు కూడా సహకరించడం అది కూడా విషాదంలో ఉండి కూడా ఇలా ఆలోచన చేయడం సామాన్య విషయం కాదని పలువురు పేర్కొన్నారు.