తన లవర్ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు బయట పెట్టిన భానుశ్రీ
స్టార్ మా లో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ షో లో నాజూకు నడుము,ఆకట్టుకునే రూపం, అబ్బుర పరిచే అందచందాలతో, తెలంగాణా యాసతో సందడి చేసిన భానుశ్రీ హౌస్ నుంచి నిష్క్రమించింది. 36 ఎపిసోడ్ ల తర్వాత ఎలిమినేట్ అయిన అవంతిక భానుశ్రీ కి చాలా హిస్టరీయే ఉంది. బాహుబలి సినిమాలో తమన్నాకు డూప్ గా శరీర ఆకృతితో అందాల మాయ చేసింది భానుశ్రీ. మత్తెక్కించే గొంతు ఆమెకున్న సూపర్ క్వాలిటీ. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఇద్దరి మధ్యలో 18, కుమారి 21ఎఫ్ పలు తెలుగు మూవీస్ లో నటించడమేకాదు,మంచి డాన్సర్ గా భాను పేరుతెచ్చుకుంది.బిగ్ బాస్ సీజన్ టు రియాల్టీ షోలో అడుగుపెట్టిన భానుశ్రీ తొలిరోజు నుంచీ,తనదైన శైలి, ఫెరఫార్మెన్స్ తో 36ఎపిసోడ్ ల వరకూ బానే రాణించింది.
ఇక భానుశ్రీ గొంతుని హోస్ట్ నాని ప్రస్తావిస్తూ మీ గొంతుకి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో తెలుసా అంటూ ఫిదా అయ్యారు కూడా. ఇక హౌస్ లో తనకు నచ్చని విషయాలను కుండబద్దలు కొట్టేసేది. ఇక ఎలిమినేషన్ తర్వాత పలు ఇంటర్యూలలో బిగ్ బాస్ షో విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా వెల్లడించింది.బిగ్ బాస్ షో లో కూడా భానుశ్రీ తన అనుభవాలను వెల్లడిస్తూ తాను అనుకున్న జీవితం కోసం ఎన్ని కష్ఠాలు పడిందో చెప్పి , కన్నీళ్లు పెట్టించిన సంగతి తెల్సిందే.
‘డాన్స్ అంటే చాలా ఇష్టం. నటిగా రాణించాలని ఉండేది. ఎంకరేజ్ మెంట్ మాత్రం లేదు. నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా గౌరవించేవారు కాదు. దీంతో డాన్స్ ,యాక్టింగ్ మీద ఇష్టంతో హైదరాబాద్ వచ్చేసాను. నా దగ్గర గల కొద్ది డబ్బుతో డాన్స్ స్కూల్ లో చేరాను. అక్కడి పరిస్థితులు ఆర్ధికంగా దెబ్బతీసి, రోడ్డున పడే దుస్థితి వచ్చింది. నటన, డాన్స్ ఇష్టం లేని పేరెంట్స్ నాకోసం వచ్చేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు మా అమ్మమ్మ, తాతయ్య మాత్రమే వచ్చేవారు.
అలా మా పేరెంట్స్ ప్రేమను కోల్పోయా. ఆ సమయంలో ప్రాణంగా ప్రేమించిన వాడు కూడా దూరం అయ్యాడు. ఇలా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒంటరిగా నిలబడ్డాను. కష్టాలు ఓర్చుకుని కలలు కన్న జీవితాన్ని సాధించాను. దీనికి ఓ వ్యక్తి కారణం. నా కష్టకాలంలో తోడుగా నిలిచింది శంకర్ రెడ్డి. అతడు లేకుంటే నేను లేను. అనుక్షణం నా నీడగా ఉంటూ ఎంకరేజ్ చేసాడు. ఐ లవ్ యు శంకర్ రెడ్డి ‘అంటూ పదేళ్లుగా నడుస్తున్న తన ప్రేమ వ్యవహారాన్ని ఇంటర్యూలో భాను శ్రీ బయట పెట్టింది. ఇక పదేళ్ల వీరి ప్రేమ ఎప్పుడు పెళ్లిపీటలకు చేరుతుందో వేచి చూడాలి.