పవన్ ఆస్తులన్నీ ఎందుకు కరిగిపోయాయో తెలుసా?
సినిమాల్లో క్రేజీ హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూ, ఓ ఉన్నత ఆశయం కోసం రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యన యాత్ర సాగిస్తున్నాడు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎంచుకున్న జనసేన ఇప్పుడిప్పుడే బలం పుంజుకొంటుంది వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి స్టార్ స్టేటస్ గల పవన్ ఇప్పటి దాకా 20 సినిమాలు పైనే నటించాడు. తొలిప్రేమ చిత్రంతో ఆయన రేంజ్ మారిపోయింది.తమ్మడు, బద్రి, ఖుషి చిత్రాలతో ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన పవన్ కి పవర్ స్టార్ బిరుదు కూడా ఈ సమయంలోనే వచ్చింది. ఏడాదికి కనీసం ఓ సినిమా చేసినా 25కోట్లు వరకూ సంపాదించగల పవన్ తనకు ప్రధాన ఆర్ధిక వనరు సినిమాలకు గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మొదటి నుంచీ విలాసాలకు దూరంగా వుండే పవన్,తన సంపాదనను శ్రద్ధగా దాచుకున్నట్లు చెప్పవచ్చు. అయితే ఆయన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కారణంగా పవన్ ఆస్తులు కూడా కరిగిపోవడం విచారకరమని చెప్పాలి.ప్రజారాజ్యం పార్టీ రాకముందు పవన్ ఆస్తుల విలువ 470కోట్ల వరకూ ఉండేదట. స్థిర చరాస్తులు పవన్ కి బానే వుంటాయని,సినీ జనాలు, రాజకీయ నేతలు కూడా భావించేవారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వాళ్ళను పవన్ ఆదుకున్నాడని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన, డిస్ట్రిబ్యూటర్ల కోసం మరో సినిమా చేయడం లాంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తనదగ్గరకు సాయం కోసం వచ్చే స్వచ్ఛంద సంస్థలకు లేదనకుండా ఆర్ధికంగా సాయం అందించేవాడని, ఒక్కోసారి ఇది కోట్లలో కూడా ఉండేదని చెబుతారు.
అంతేకాదు ఖుషి చిత్ర సమయంలో పవన్ కి రెండు ఇంపార్టెంట్ బైక్ లు ఉండేవి. ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు అవసరమైతే, వాటిని వేలం వేయించి వచ్చిన డబ్బు ఇచ్చాడట పవన్. ఇక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసాక తన రెండు బెంజి కార్లను కూడా అమ్మేసి, స్కోడా కారుతో సరిపెట్టుకున్నాడట. ఆస్తుల్లో చాలా భాగం సామాజిక కార్యక్రమాలకు కేటాయించాడని, అది రేణు దేశాయి కి నచ్చకపోవడం వలన విడిపోవడానికి దారితీసిందని అంటారు కూడా.
జనసేన పెట్టాక అయితే ఆస్తులు బాగా తగ్గిపోయి, చాలా స్వల్పంగా స్థిరాస్తులు ఉన్నాయని, పార్టీని నడపడం కష్టంగా మారిందని,అందుకే పార్టీకోసం నిధుల సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నారైలు ముందుకొచ్చి,పవన్ కి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు తామే నిర్వహించాలని డిసైడ్ అయ్యారని టాక్.