Movies

సమంత ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇప్పటికే ఎన్నో చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ,తాజాగా రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో అందాల సమంత తుళ్లిపడుతోంది. ముఖ్యంగా పెళ్లయ్యాక కూడా నటనకు మెట్టినింటి వాళ్ళు ఇచ్చిన భరోసాతో దూసుకెళ్తోంది. మరోవైపు మహానటి మూవీ ఇచ్చిన మెగాహిట్ తో పరవళ్లు తొక్కుతున్న ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం యు టర్న్ మూవీలోనూ, అలాగే తమిళంలో సీమరాజు సినిమా చేస్తోంది. ఇక అటు భర్త నాగచైతన్య హీరో కావడం, మామ నాగార్జున, అత్తయ్య అమల,మరిది అఖిల్ ఇలా ఇల్లంతా కూడా నటులే కావడం సమంతకు పూర్తి ఎంకరేజ్ మెంట్ లభిస్తోంది. నటన విషయంలో ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం వలన నటనపై పూర్తి శ్రద్ధ పెట్టి, ఆయా పాత్రలలో ఒదిగిపోతున్నానని సమంత చెబుతోంది. కుటుంబ అండ దండలే అందుకు ప్రధాన కారణమని అంటోంది.

ఇక వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే, ఆమె తండ్రి ప్రభు తెలుగువాడే. వాళ్ళది వైజాగ్. అయితే చాలాకాలం క్రితమే చెన్నైలో సెటిల్ అయ్యారు. కేరళకు చెందిన నీనెట్టి అనే మహిళతో మ్యారేజ్ కావడంతో 1987ఏప్రియల్ 28న సమంత పుట్టింది. జోనాటన్,డేవిడ్ అనే ఇద్దరు అన్నయలున్నారు.
ఇక తమిళనాడులోనే పుట్టి పెరగడంతో తాను తమిళియన్ గా భావిస్తూ,అందరికీ అలానే పరిచయం చేసుకుంటోంది.

హోలీ ఏంజెల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివి,స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. మోడలింగ్ ద్వారా వెలుగుచూసిన సమంత,ఆతర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. అక్కడినుంచి వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ రాణిస్తోంది. సమంత మొదటి చిత్రం హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి, చివరికి అతన్నే గత ఏడాది గోవాలో మ్యారేజ్ చేసుకుంది.

ఇక సమంత సంపాదన విషయానికి వస్తే మోడలింగ్ నుంచి ఆమె సంపాదించిన ప్రతిరూపాయి ఆమెకే ఇచ్చేసారు తల్లిదండ్రులు. దాంతో ఆమె మోడలింగ్ నుంచి మూవీస్ లోకి వచ్చేసరికే ఆమె లక్షాధికారి. ఆతర్వాత దూకుడు సినిమాతో కోటీశ్వరురాలైంది. ఆమె ఆస్తి మొత్తం 165కోట్లు గా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు చెన్నై, ముంబయి,బెంగళూరులో ఆమె కు స్థరస్తులున్నాయని అంటారు.
Samantha,Naga Chaitanya
గత నాలుగైదు ఏళ్లుగా ఒక్కో సినిమాకు 3 కోట్ల దాకా పుచ్చుకుంటున్న సమంత తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు వెచ్చిస్తోంది. ఇక మిగిలిన మొత్తాన్ని చెన్నైలోని తమ ఫ్రెండ్స్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు బోగట్టా. అలా వచ్చిన సొమ్ములో 50శాతం తన ప్రత్యూష ఫౌండేషన్ కి కేటాయిస్తూ, తన పెద్దమనసు చాటుకుంటోంది.