Movies

RX 100 హీరోయిన్ పాయల్ తల్లి కూడా పెద్ద నటి ఆమె ఎవరో తెలుసా?

తాజాగా విడుదలైన ఆర్ ఎక్స్ 100 మూవీ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం 2నుంచి 3కోట్లు ఖర్చుతో తీసిన ఈ మూవీ అప్పుడే 10కోట్లు గ్రాస్ దాటేసింది. ఇది లైఫ్ లో ఇంకా ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలని సినీ జనాలు అంటున్నారు. 2017లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి కూడా భారీ వసూళ్లనే సాధించింది. ఇక అప్పటినుంచి ఈ మూవీలో నటించిన షాలిని పాండే కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్య సాహసాలు చేస్తే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని పలు పరిణామాలు నిరూపిస్తున్నాయి. సరిగా అదే సాహసంతో ఆర్ ఎక్స్ 100 ద్వారా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి మూవీ తోనే మంచి గుర్తింపు సాధించేసింది.

పాయల్ రాజ్ పుత్ తొలుత కొన్ని సీరియల్స్ నటించి, మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలీదు.ఇక పాయల్ రాజ్ పుత్ తల్లి కొన్ని సీరియల్స్ లో నటించారు. సైడ్ యాక్టర్ గా నటించడం వలన తగిన గుర్తింపు రాలేదు. దీంతో తన కూతుర్ని ఎలాగైనా మంచి హీరోయిన్ ని చేయాలని నిర్ణయించుకుంది.

నిజానికి ఆర్ ఎక్స్ 100కథ చెబితే పాయల్ రాజ్ పుత్ ఒప్పుకోలేదట. దీంతో తల్లి ధైర్యం చెప్పి, ఏమీ కాదు కథ బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఎంకరేజ్ చేసింది. అప్పుడు తల్లి మాట పెడచెవిన పెట్టి ఉంటే, ఇంత గొప్ప విజయం అందుకునే ఛాన్స్ మిస్సయ్యేది. ఏది ఏమైనా ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తో దూసుకుపోవడం తో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక టాలీవుడ్ లో ఓ మంచి విజయం సాధిస్తే, ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయి మరి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."