Movies

బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే తెలుస్తుంది….ఎలానో చూడండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ వన్ కి, ప్రస్తుతం నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ టుకి గల తేడాలను సోషల్ మీడియాలో రోజురోజుకీ విశ్లేషణలు వస్తూనే వున్నాయి. దీనికి బిగ్ బాస్ సీజన్ టులో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణం. అంత దారుణంగా సీజన్ టు తయారయిందని విమర్శలు చెలరేగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో పాటు, ప్రతి టాస్క్,ప్రతి సెంగ్మెంట్ ఎంతో సస్పెన్స్ గా సాగేది. కానీ సీజన్ టుకి వచ్చేసరికి కాస్తంత ఎక్సయిట్ మెంట్ తగ్గడమే విమర్శలకు కారణం అయిందని చెప్పవచ్చు. తొలి సీజన్ పూనెలో సెట్ చేయడం వలన అక్కడ ఏమి జరుగుతోందో కేవలం షోలోనే చూసేవాళ్ళు.

అయితే ఈ దఫా హైదరాబాద్ నడిబొడ్డున బిగ్ బాస్ సెట్ వేసేసరికి సస్పెన్స్ గా ఉండాల్సిన విషయాలు కూడా ముందే లీకవుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో కూడా సీక్రెట్ దాగడం లేదు. ముందస్తుగానే తెల్సిపోవడంతో షో మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తోందని పలువురు విమర్శకులు అంటున్నారు. శ్యామల,భాను ఎలిమినేషన్స్ ముందే లీకయ్యాయి కూడా.

ఇక ఈవారం ఎలిమినేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని లీకులు చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఈసారి,సామ్రాట్ రెడ్డి బయటకు వచ్చేస్తాడని చెప్పేయొచ్చు అనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ ఆదివారం ఉండాల్సిన ఎలిమినేషన్ గురించి గురువారం నాటికే తెలిసి పోయిందంటే లీకులు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక లీకయ్యాయి కాబట్టి,వేరేవాళ్లను ఎలిమినేట్ చేసేస్తారా, లేక లెక్కప్రకారం సామ్రాట్ బయటకు వస్తాడో వేచి చూడాలి.