Movies

కన్నుకొట్టి రాత్రికి రాత్రే ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

‘ఓరచూపు తోనే’అంటూ మహ్మద్ రఫీ పాడిన ఫెమస్ పాట అప్పట్లో సూపర్ హిట్ .. కానీ ఈ భామ ఏకంగా ఓరచూపుతో కన్నుకొట్టి యావత్ ప్రపంచాన్ని స్వల్పకాలంలోనే ఆకర్షించింది. అందుకే ఆమె పేరు మారుమోగిపోతోంది. ఆమె పేరు ప్రియా ప్రకాష్ వారియర్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈమె గురించి కథనాలు కోకొల్లలుగా వచ్చిపడుతున్నాయి. ఓ కంటి చూపుతో అటు సినీ ప్రపంచాన్ని, ఇటు కార్పొరేట్ కంపెనీల చూపుని తనవైపు తిప్పేసుకుంది ఈ సొగసరి భామ.అందుకే ఈ భామ డబ్బులు కూడా బానే వెనకేసుకుంది. ఇక ఆమె అంతర్జాలంలో సెన్షేషన్ క్రియేట్ చేయడంతో ఆమెతో సినిమాలు చేయాలనీ బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు భావించారు.

అయితే ఈ అమ్మడు మాత్రం స్టడీ పూర్తయ్యాకే సినిమాలు అంటూ సున్నితంగా తిప్పికొడుతోంది. అందుకే ఇక కొన్ని రోజులయ్యాక ఆమె వెనుక పడడం ఎందుకులే అను కొందరు నిర్మాతలు ఆగిపోయారు. ఇక యాడ్స్ లో యాక్ట్ చేసైనా సరే నాలుగు డబ్బులు కూడబెట్టాలని ప్రియా ప్రకాష్ వారియర్ భావించింది. ఎందుకంటే యాడ్స్ త్వరగా ముగుస్తాయని, పైగా స్టడీస్ ఆటంకం కూడా ఎలాంటి ఆటంకం ఉండదని ఆమె ఆలోచన.

Instagram పోస్టుల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నందున ఎక్కువ మొత్తాన్ని అంటే లక్షల్లోనే డిమాండ్ చేసింది. అప్పట్లో యాడ్స్ వాళ్ళు ఆమె అడిగినంత సమర్పించుకునేవారు. రానురాను డిమాండ్ పడిపోవడంతో ఇక ఇప్పుడు ఏమి చేయాలా అని మదనపడుతోందట. అందుకే మౌనమే మంచిదని కొంతకాలం సైలెంట్ గా ఉందని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."