Movies

బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్….ఈ భామ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తున్నారో తెలిసిపోయింది. ఇప్పటివరకు రోజుకో పేరు విన్పించింది. అయితే ఇప్పుడు పక్కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యినట్టు సమాచారం. ఆమె పేరు పూజ పూజ రామచంద్రన్. ఈమె స్వామి రారా సినిమాలో భానుగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా పూజ రామచంద్రన్ తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో హీరోగా నాని నటించాడు. S.S. మ్యూజిక్ ఛానల్ లో యాంకరింగ్ కూడా చేసింది ఈ చిన్నది. ఆర్మీ కుటుంబంలో జన్మించిన పూజ కోయంబత్తూర్ లో విజువల్ కమ్యూనికేషన్స్ చదివింది. జయ టివిలో కొన్ని షోలకు యాంకరింగ్ చేసింది.

తమిళం,మలయాళం సినిమాల్లో కూడా నటించింది పూజ. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నది. పూజ తెలుగువారికి దగ్గర కావటానికి బిగ్ బాస్ షో ఒక వారధి కానున్నది. ఆమె ఎలా తెలుగువారికి దగ్గర అవుతుందో చూడాలి.ఈ భామ బుల్లితెర నుండి వెండితెరకు వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."