Movies

రెండో పెళ్లి వార్తలకు చెక్ పెట్టిన సింగర్ సునీత బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

చాలాకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న సింగర్ సునీత, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరహాలోనే రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.దీనిపై విస్తృతంగా ప్రచారం సాగిపోతోంది. దీంతో సునీత రంగంలో దిగి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.ఈ వార్తలపై సునీత ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని స్పష్ఠచేసింది. హాయ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా కంగ్రాట్స్ అంటూ చాలా ఫోన్లు వస్తున్నాయని ఆమె పేర్కొంటూ,ఒకవేళ చేసుకోవాలనే ఆలోచన ఉంటే అందరికీ చెప్పే చేసుకుంటానని, అయితే ప్రస్తుతానికి మాత్రం అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది. మధురంగా గీతాలు ఆలపించే సునీత ఒకప్పుడు నెంబర్ వన్ గాయని. కేవలం గాయని గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సునీత స్వస్థలం గుంటూరు. 1978 మే10 న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఉపద్రష్ట నరసింహారావు, సుమతి దంపతులకు సునీత జన్మించింది. బాల్యం నుంచి సంగీతం పై మక్కువగల ఈమె పెమ్మరాజు సూర్యారావు దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందడమే కాకుండా చిన్నతనంలోనే గురువుగారితో కల్సి త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరి చేసి, మెప్పించింది. కేవలం 15 ఏళ్ళ ప్రాయంలోనే గులాబీ మూవీలో పాటలు పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు’అనే సాంగ్ ఎంతటి పాపులర్ అయిందంటే, అక్కడినుంచి సునీత శకం మొదలయ్యేలా చేసింది. దాదాపు అన్ని భాషల్లో వెయ్యికి పైనే పాటలు పడడమే కాదు, 500కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. నంది అవార్డులు, ఫిలిం ఫెర్ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలానే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత దారుణమైన అనుభవాలు చవిచూసింది. అందుకు ఆమె భర్త కారణం అని చెప్పవచ్చు.

ఆమె 19 ఏళ్ళవయస్సులోనే గోపరాజు కిరణ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడు ఓ మీడియా సంస్థలో పనిచేసేవాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆమె తర్వాత భారీ మూల్యం చెల్లించుకుంది.ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నిజస్వరూపం తెల్సి వణికిపోయింది. మానసికంగా, శారీరకంగా అతని చేతిలో చిత్ర హింసలు అనుభవించింది. అతడో మోసగాడని తేలిపోవడంతో కాపురం చేయలేక నరకం చూసింది. భర్త చేసిన లక్షల్లో అప్పులు,ఇక ప్రతి రోజూ ఏదోక విషయంలో మోసం చేయడం,ఇంకా చెప్పాలంటే,భర్త నుంచి ఓ భార్య ఏమి ఆశించకూడదో సునీతకు అదే ఎదురైంది.

అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళు అవడంతో సమాజం ఏమనుకుందోనన్న భయంతో సునీత భర్త నుంచి పిల్లలను తీసుకుని దూరంగా వచ్చేసింది. ప్రస్తుతం 20 ఏళ్ళ కొడుకు ఆకాష్ ఢిల్లీలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతుండగా, కుమార్తె 17 ఏళ్ళ శ్రేయ హైదరాబాద్ లోనే డిగ్రీ చేస్తోంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన నేపథ్యంలో ఇప్పుడు రెండో పెళ్లి వార్తలు వస్తే, వాళ్ళ పరిస్థితి ఏమిటని, అయినా ఇలాంటి స్థితిలో తాను రెండో పెళ్లి చేసుకుని కొత్త బంధంలో ఇమడగలనా అని సన్నిహితుల దగ్గర సునీత చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొడుకు ఆకాష్ మాత్రం ఈ వార్తలు చూసి కొంత ఆశ్చర్యపోయినా, మళ్ళీ పెళ్ళిచేసుకుని హాయిగా ఉండొచ్చు కదా మమ్మీ అంటూ సలహా ఇచ్చినట్లు సునీత స్వయంగా వెల్లడించడం విశేషం.