Movies

10 సెకండ్లు గేట్ ఓపెన్ చేస్తా గణేష్ ని వెళ్ళిపోమన్న నాని…. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 2 ఆరో వారానికి వచ్చేసింది. ఈ వారం నాని ఎవరిని ఎలిమినేట్ చేస్తాడా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ కోసం నామినేట్ అయినా సామ్రాట్,దీప్తి,తేజస్వి,తనీష్, రోల్ రైడా లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఎదురు చూస్తున్నారు. అయితే తనీష్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి సేఫ్ జోన్ లోకి వచ్చేసాడు. ఈ రోజు నాని గణేష్ మీద చాలా ఫైర్ అయ్యాడు. గణేష్ చేసిన అతి నానికి నచ్చలేదు. యుద్ధంలో సైనికుడిగా పోరాటం చేస్తానని చెప్పిన నీవు ఒక గుడ్డు కొట్టగానే నీ పనితనం ఏమైందని అని నాని అడిగితే… గణేష్ తల మీద కోడిగుడ్డు కొట్టగానే చాలా కోపం వచ్చేసిందని,అలాగే చాలా గట్టిగా తగిలిందని చెప్పటంతో గణేష్ మీద నాని సీరియస్ అయ్యాడు.

గేట్స్ ఓపెన్ చేస్తా 10 సెకండ్ లలో బయటకు వెళ్ళిపోతావా అని అడుగుతాడు. దీనికి గణేష్ ఏమి అన్నాడో ఈ రోజు రాత్రి 9 గంటలకు చూడాలి. మొన్న అమిత్ గణేష్ తల మీద గుడ్డు పగలకొట్టగానే గేట్స్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతా…ఈ కుళ్ళు కుతంత్రాల మధ్య ఉండలేనని అన్నాడు. ఒక పక్క దీప్తి సీక్రెట్ టాస్క్ అని చెపుతున్న సరే గణేష్ హడావిడి చేసేసాడు. గుడ్డు సీన్ అల హైలెట్ అయ్యిపోయింది.