Movies

బ్రేకింగ్ న్యూస్ ఈ వారం హౌస్ నుంచి తేజస్వి ఔట్ … ఆనందంలో కౌశల్ ఫ్యాన్స్

బిగ్ బాస్ సీజన్ 2 లో ఈ వారం తేజస్వి ఎలిమినేట్ అవుతుందంటే చాలా మంది బాధపడుతున్నారు. తేజస్వి కాస్త అతి చేస్తుంది. అంతేకాక ఇంటి సభ్యులను రెచ్చకొడుతుంది. అలాగే చాడీలు చెప్పుతుంది. మొత్తం హౌస్ అంతా తన గ్రిప్ లో ఉండాలని భావిస్తుంది. ఇలా అనేక పిర్యాదులు తేజస్విని మీద ఉన్నాయి. అయితే ఇంటిలో ఉన్న సభ్యులందరిలో తేజస్వి మాత్రమే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. ఇప్పటివరకు ఆమె ఎంత అతి చేస్తున్న ప్రేక్షకులు ఆమెను కాపాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ హౌస్ లో చాలా చురుకుగా ఉంటుంది. ఎన్ని తప్పులు చేసిన ఆ చురుకుదనం ఆమెను కాపాడుతూ వచ్చింది. అయితే గత నాలుగు వారాల ఎలిమినేషన్ పార్టిసిపెంట్స్ కి తేజస్విని పరోక్షంగా కారణం అయింది.

గత వారం భానుశ్రీని కౌశల్ పై రెచ్చకొట్టి భానుశ్రీ ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఇక ఈ వారం తేజస్వి ఇంటి సభ్యులతో నేనే ఈ వారం ఎలిమినేట్ అవుతానని చెప్పి,సామ్రాట్ తో ఎలిమినేట్ కానని చెప్పి గందరగోళంలో పాడేసింది. తేజస్వి ఎప్పుడు నామినేట్ అవుతుందా…ఎలిమినేట్ చేయటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.

సామ్రాట్ తో రొమాన్స్,ఇంటిలో డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేకపోవటం చూసి జనం కూడా ఫైర్ అవుతున్నారు. ఒకవేళ తేజస్వి ఎలిమినేట్ అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్ కళ తప్పుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి,సామ్రాట్ జంట ఒకరకమైన జోష్ ని తీసుకువచ్చింది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే తేజస్వి లేదా సామ్రాట్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాని ప్రకటించాడు.