Movies

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మంచువారమ్మాయి మాట్లాడే ఇంగ్లీష్ ని ఒక అట ఆడుకున్న నాని

శనివారం,ఆదివారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ లో నాని చేసే సందడి అంతా ఇంతా కాదు. అందరిని వెటకారంగా మాట్లాడుతూ వెక్కిరిస్తూ తాను మాట్లాడాలని అనుకున్నది మాట్లాడుతూ ఆదివారం చివరలో ఎలిమినేట్ ఎవరు అవుతారో చెప్పి వారితో కాసేపు ముచ్చట్లు జరిపి సెలవు తీసుకుంటాడు నాని. ఆదివారం ఎలిమినేషన్ ముందు ఒక గేమ్ పెట్టి జోష్ లోకి తీసుకువస్తాడు. ఈ రోజు ఎలిమినేషన్ కి ముందు W% రామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మంచు లక్ష్మి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులతో కలిసి మంచు లక్ష్మి చాలా సందడి చేసేసింది. నాని పెట్టిన ఇమిటేషన్ గేమ్ ని మంచు లక్ష్మి బాగా ఎంజాయ్ చేసింది.

అలాగే మంచు లక్ష్మి మాట్లాడే ఇంగ్లిష్ కి కూడా నాని పంచ్ లు వేసి హడావిడి బాగానే చేసాడు. మంచు లక్ష్మి సామ్రాట్ గురించి మాట్లాడుతున్న సమయంలో నాని వేసిన పంచ్ లకు మంచువారమ్మాయి మంచు లక్ష్మి కూడా తేలికగా తీసుకుందని సమాచారం.