Movies

RX 100 మూవీ డైరెక్టర్ గురించి బయట పడిన సంచలన విషయాలు

యంగ్ హీరో కార్తికేయ,స్లిమ్ బ్యూటీ పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఆర్ ఎక్స్ 100మూవీ ఇటీవల తెలుగులో విడుదలై, ఘన విజయం అందుకుంది. సంచలనం సృష్టించిన ఈ మూవీలో హీరోయిన్ కొన్ని సీన్స్ లో బోల్డ్ నటించడం,హీరోని డిఫరెంట్ గా చూపించడం ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. ఇక పెద్ద సినిమాలకు తీసిపోని రీతిలో కలెక్షన్స్ ఊపేస్తున్నాయి. వాస్తవానికి ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అజయ్ భూపతికే దక్కుతుంది. మొదటి మూవీతోనే సెన్షేషనల్ హిట్ కొట్టిన ఈ న్యూజనరేషన్ ఫిలిం డైరెక్టర్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు.ఇక తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

కోనసీమలోని ఆత్రేయపురం గ్రామానికి చెందిన అజయ్ భూపతి పూర్తిపేరు యజ్ఞేశ్ అజయ్ భూపతిరాజు. తండ్రిపేరు వేగేశ్న రామరాజు. ఆ ఊళ్ళో రొయ్యల చెరువులు, పొలాలు చాలానే వున్నాయి. తల్లిది కూడా అదే ఊరు కావడంతో ఇరువైపులా బంధువులతో సందడిగా ఉండేదట. సొంతూళ్లోనే టెన్త్ వరకూ చదివిన అజయ్, డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. డిగ్రీ పూర్తయ్యాక తన ఫ్రెండ్ రూమ్ లోనే ఉంటూ ప్రయత్నాలు చేసుకునేవాడు.

బెల్లంకొండ సురేష్ సంస్థలో రైట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన అజయ్ రామ్ గోపాల్ వర్మ దగ్గర చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. కిల్లింగ్ వీరప్పన్ మూవీలో వీరప్పన్ ఇంటర్ డక్షన్ సీన్ ని పిక్చరైజేషన్ చేసే ఛాన్స్ ఇచ్చాడంటే, అతడిలోని టాలెంట్ ని వర్మ ఎంతగా గుర్తించాడో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి అంతకు ముందు ఇంకో దర్శకుడి దగ్గర చేరిన అజయ్ సీనియార్టీ ని కాదని వెనుక వచ్చినవాళ్లకు జీతం పెంచడంతో వర్మ దగ్గరకు చేరాడు.

వర్మ దగ్గర ఎన్నో మెళుకువలు నేర్చుకోడానికి అదే అజయ్ సినీ జీవితానికీ మలుపు అని చెప్పాలి. ఇప్పుడు ఎవరీ యంగ్ డైరెక్టర్ అనిపించుకుంటున్నాడు అజయ్ భూపతి. ఇక కుర్రాడు కనుక లవ్ అనేది సహజం కూడా. ఇక ప్రేమలో కూడా ఎదురుదెబ్బలు తగిలాయట. ఇక ప్రభాస్ కి చుట్టమైనా సరే ఎక్కడా ఆ పేరు ప్రస్తావించకుండా అజయ్ స్వశక్తితో ఎదిగాడు.

అజయ్ వదిన ప్రభాస్ బంధు వర్గం నుంచే వచ్చినా ఏనాడూ వెళ్లి రికమండేషన్ అడగలేకపోయానని అజయ్ చెప్పుకొచ్చాడు. ఇక మొదటి సరిగా అజయ్ ని కలిసినవాళ్లకు యితడు ప్రభాస్ లానే ఉన్నాడని కూడా అనిపిస్తుంది. వీరా షూటింగ్ లో కూడా కాజల్ చూసి, హీ లుక్స్ లైక్ ప్రభాస్ అనేసిందట.