Movies

మెగా డాటర్ నిహారికను చితకబాదేసిన నాగబాబు… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

మెగా కుటుంబం నుంచి సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన నిహారిక స్టైల్ వేరు. ఎవరి అండదండలు లేకుండా సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్న ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు అటు తమిళం,ఇటు తెలుగు ఫీల్డ్స్ లో ఎక్కడ అవకాశలుంటే అక్కడ వాలిపోతూ తనకంటూ స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. మాస్ కమ్యూనికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ మెగా డాటర్ ఎంతో ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసింది.నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు చాలామంది వచ్చినా హీరోయిన్స్ రాలేదన్న లోటు నిహారిక తీర్చేసింది. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లతో పాటు ఒకమనసు లాంటి సినిమాలు కూడా నిహారిక కెరీర్ లో చెప్పుకోదగ్గవి. ఇక ఈమె తాజాగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ మూవీ రిలీజ్ కి దగ్గరపడింది.

ఈ సందర్బంగా మెగా డాటర్ పలు ఆసక్తికర సంఘటనలు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పంచుకుంది. చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటానని చెబితే నాగబాబు ఓ ట్రైనర్ దగ్గరకు తీసుకెళ్లగా, అక్కడ ఇష్టం వచ్చినట్లు ఆమెను వంచడంతో ఫీవర్ వచ్చేసి, ఇక గుడ్ బై చెప్పేసిందట. పోనీ క్లాసికల్ డాన్స్ కోసం వెళ్తే అక్కడ కూడా ఒకటి రెండు రోజులకే ఇలాంటి అనుభవమే ఎదురవడంతో దానికి దూరం అయింది.

ఇక కాలేజీ డేస్ లో తల్లి బలవంతం మీద ఎంపీసీ గ్రూప్ తీసుకున్న నిహారిక,డిగ్రీలో మాత్రం తనకు ఇష్టమైన మాస్ మీడియా కోర్సు చదివింది. ఆరోజుల్లో 8మంది కలిపి ఓ గ్రూప్ గా వుండేవాళ్ళట. ఇప్పటికీ తరచూ అంటే వారంలో నాలుగైదు సార్లు వారంతా కలుస్తూ ఉంటారట. ఇక ఓ రోజు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిందట.

ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందో తెలియక మెగా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ అంతా గాలించినా తెలియకపోవడంతో ఆందోళనకు గురై , పోలీసులకు పిర్యాదు చేయాలని భావిస్తున్న తరుణంలో ఫ్రెండ్ ని వాకబు చేయడంతో అసలు విషయం బయట పడిందట.
దీంతో నిహారిక ఇంటికొచ్చేసరికి తండ్రి ఉగ్ర రూపం దాల్చాడట. ఆగ్రహంతో ఊగిపోతూ నిహారికకు చితకబాదేశాడట.
Niharika Maraige
ఈ లోగా తల్లి అడ్డుపడడంతో మరికొన్ని దెబ్బలు తప్పాయి. ఇప్పటికీ తండ్రి నాగబాబు క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోరని,ఇంటికి లేట్ గా వచ్చినా, లేట్ గా లేచినా సహించడని నిహారిక వివరించింది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కి వచ్చిన లవ్ లెటర్స్ చదివేదట. అయితే వాటిల్లో పొగడ్తలు తప్ప ఇంకేమీ ఉండేవి కావని,తీరా చదివేసాక విసుగు వచ్చేదని, ఇక తాను ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదని స్పష్టంచేసింది.