Politics

బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెట్టటానికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

ఆనాడే కాదు ఈనాడు కూడా ఎన్టీఆర్ అనే పేరు చెబితే చాలు ఇటు ఇండస్త్రీలో అటు పబ్లిక్ లో తారక మంత్రం లాంటిదని చెప్పవచ్చు . ఈ పేరు వైబ్రేషన్ అలాంటిది మరి. అందుకే ఫాన్స్ నుంచి పబ్లిక్ దాకా, యాక్టర్స్ నుంచి స్టార్స్ వరకు,డాన్స్ నుంచి రియాల్టీ షోల వరకూ, దర్శకులు నుంచి నిర్మాతల వరకూ ఇలా అందరికీ కావాల్సిన పేరు ఎన్టీఆర్ అయిందండంలో సందేహం లేదు. అయితే అందరూ ఆదరించి అక్కున చేర్చుకుంటున్న ఎన్టీఆర్ ని కావాల్సిన వారే అంటే స్వయానా బాబాయ్ అదేనండి బాలకృష్ణ దూరం పెట్టడం ఆశ్చర్యమేమరి.ఎంతలేదన్నా నందమూరి రక్తం ఎన్టీఆర్ లో వుంది. జెండాని భుజాన వేసుకుని నడిపించాల్సిన వాడే. ఇవన్నీ బాలయ్యకు తెలియవా అంటే ఎందుకు తెలియదు.

అయితే అన్న కొడుకుని అక్కున చేర్చుకోడానికి ప్రధానంగా ఓ ఐదు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయట. నిజానికి బాలయ్యకు,తారక్ కి ఎలాంటి గొడవలు లేవు. నిజం చెప్పాలంటే బాలయ్యకు,హరికృష్ణకు అభిప్రాయం బేధాలున్నాయి. హరికష్ణ, బాలయ్య మధ్య రాజకీయ విభేదాల కారణంగా ఎన్టీఆర్ ఏమి చేయలేడు కదా. అందుకే బాలయ్య,హరికష్ణ కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుంది.

అప్పుడు ఎన్టీఆర్ ని అక్కున చేర్చుకోడానికి బాలయ్య సిద్ధం గానే ఉంటాడు. ఇది ఇలా ఉంచితే తారక్ కి గల టాలెంట్ కూడా బాలయ్యకు దూరం చేయడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫాన్ ఫాలోయింగ్ దండిగా గల సమయంలో ఎన్టీఆర్ మావాడే అని బాలయ్య అంటే ఫ్యామిలీ మొత్తం ఆటే వెళ్ళిపోతుంది.

అక్కడే అసలు గొడవ అంతానని తెలుస్తోంది. ఒకవేళ బాలయ్య అలాచేస్తే,ఎన్టీఆర్ ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉన్నన్నాళ్లూ మోక్షజ్ఞకు ఇబ్బంది తప్పదన్న ఆలోచన ఉందట. అందుకే తారక్ ని బాలయ్య కోలుకోలేక పోతున్నాడని టాక్.ఇక బాబాయ్ ,అబ్బాయ్ లు వేరు పడడానికి రాజకీయ పరమైన కారణాలున్నాయని అంటున్నారు. బాలయ్యతో కల్సి ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే, లోకేష్ కన్నా ఎక్కువ క్రెడిట్ కొట్టేసేది ఎన్టీఆర్. ఇక పెద్దాయన మనవడిగా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగించాలన్న వత్తిడి క్షేత్రస్థాయి నుంచి రావచ్చు.
NTR
ఇది కూడా ఓ కారణమే కదా. ఇవన్నీ ఒక ఎత్తైతే అప్పటిలో జరిగిన కొడాలి నాని ఇన్సిడెంట్ బాలయ్య మైండ్ లో బలంగా ఉండిపోయిందట. ఆరోజు టిడిపిని విమర్శిస్తూ పార్టీ నుంచి బయటకు పోతుంటే తారక్ అడ్డుకునే యత్నం చేయలేదన్నది బాలయ్య మదిలో గట్టిగా ఉందట. ఇక బాలయ్య కోపం అందరికీ తెల్సిందే. కోపం రావడానికి చిన్న పని చేసినా చాలు.

మరి జూనియర్ ఆలాంటి పని ఏదైనా చేసి, బాబాయ్ కి కోపం కలిగించాడా అనే సందేహం వుంది. అయితే బాలయ్య కోపం నీటి బుడగ లాంటిందని, బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తే,కోపం కరిగిపోతుంది. సో మొత్తానికి ఐదు రీజన్స్ వలన బాబాయ్ , అబ్బాయ్ ల మధ్య దూరం నడుస్తోందని చెప్పవచ్చు