Movies

నిత్యా మీనన్ జీవితంలో ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు…ఏమిటో చూడండి

అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయిన కేరళ బ్యూటీ నిత్యామీనన్ తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచింది. స్టార్ హీరోయిన్ టబు చెల్లెలి పాత్రలో బాల నటిగా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు కొద్దికి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఎన్నో సినిమాల్లో పాటలు పాడి తనలోని గాయని కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. జర్నలిస్ట్ కావాలని భావించిన ఈమె అనుకోకుండా హీరోయిన్ గా సెటిల్ అవ్వడం ఆశ్చర్యకరమే మరి.ఇక ఆసక్తికరమైన నిత్యా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, ఆమె 1988 ఏప్రియల్ 8న జన్మించింది. కేరళ వాస్తవ్యులైన ఈమె తండ్రి కాలికట్ కాగా, తల్లి పాలక్కాడ్ నుంచి వచ్చింది. అయితే చాలాకాలం క్రితమే బెంగళూరులో స్థిరపడ్డంతో నిత్యా స్టడీస్ గార్డెన్ సిటీలోనే సాగింది.

పదేళ్ల ప్రాయంలోనే ఓ ఆంగ్ల చిత్రంలో టబు చెల్లెలుగా దర్శనమిచ్చింది. 2005లో సెవన్ ఓ క్లాక్ మూవీలో లీడ్ రోల్ ద్వారా కెరీర్ ని సీరియస్ గా తీసుకుంది. ఇక ఆ తర్వాత పూణేలో ఓ ఎగ్జామ్ రాస్తూనే నందిని రెడ్డితో పరిచయం ఏర్పడడం,పర్యవసానంగా అలా మొదలైంది మూవీతో నిత్యా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఏదైనా దశ ఉంటే ఆపలేరు కదా అందుకే ఆమె ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఇక నితిన్ హీరోగా ఇష్ మూవీతో భారీ హిట్ కొట్టేసి, తన ఖాతాలో వేసుకున్న నిత్యా , ఆ తరువాత గుండె జారి గల్లంతయింది, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక జనతా గ్యారేజ్ మూవీతో తిరుగులేని బ్లాక్ బస్టర్ కొట్టింది.

తమిళ,మలయాళ మూవీస్ లో కూడా స్టార్ హీరోయిన్ అయిన నిత్యా ,చాలా పొట్టిగా వున్నా, షూటింగ్స్ సమయంలో హెవీ హీల్స్ ధరిస్తుంది. ఇక సెట్స్ లో హీరో హైట్ ని బట్టి మినీ టేబుల్ తో మేనేజ్ చేస్తారట. తెలుగు,తమిళ భాషల్లో పాటలు కూడా పాడే నిత్యా హీరోయిన్,గాయనిగా కొనసాగుతూ,మలయాళంలో కొరియోగ్రాఫర్ గా కూడా రాణిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు.

తమ పూర్వికులు కేరళలో ఉన్నా అక్కడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదని నిత్యా చెబుతోంది. గత రెండు తరాలుగా కన్నడ గడ్డపై ఉంటున్నందున తాను పక్కా కన్నడ అమ్మాయినేనని స్పష్టం చేసే నిత్యా, కేరళ అమ్మాయి అంటే అస్సలు ఒప్పుకోదు.