Movies

శ్రీదేవి కూతురు జాన్వి ‘ధడక్‌’ సినిమాకి ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు

బాలీవుడ్ లో సినిమాలు అంటే చాలా భారీగానే ఉంటాయి. పారితోషికాలు కూడా అంతే భారీగానే ఉంటాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ప్లాప్ అయినా సరే వంద కోట్లను అవలీలగా దాటేస్తాయి. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికం కూడా మన దక్షిణాది తారల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే దక్షిణాది కన్నా బాలీవుడ్ తారల పారితోషికం నాలుగు రేట్లు అధికంగా ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్‌గా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద బేనర్,శ్రీదేవి కూతురు కావటంతో ‘ధడక్‌’ సినిమా విడుదల అయినా మొదటి రోజు 9 కోట్లను వసూలు చేసింది. లాంగ్‌ రన్‌లో మంచి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

ఇంత భారీ విజయాన్ని సాధించిన ‘ధడక్‌’ చిత్రానికి జాన్వి తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా కోసం జాన్వి పారితోషికం కింద కేవలం 60 లక్షలను మాత్రమే తీసుకుందట. శ్రీదేవి అభిమానులు కరణ్ జోహార్ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారట. సినిమా అముఞ్చి వసూళ్లను సాధించింది కదా ఇప్పుడైనా జాన్వికి గౌరవ ప్రధమైన పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇటువంటి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండే కరణ్ జోహార్ ఎక్కువ పారితోషికం ఇవ్వటానికి ఎందుకు ముందుకు వస్తాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."