Movies

కమెడియన్ అలీలో ఎవరికి తెలియని చీకటి కోణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగులో బ్రహ్మానందం కన్నా ముందే కెమెరా ముందుకు వచ్చిన కమెడియన్ ఎవరంటే ఆలీ అని చెప్పాలి. బాల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి,ఇప్పటివరకూ వెయ్యికి పైగా చిత్రాలు చేసిన ఆలీ, సాధించిన ఘనత గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. ఆ రోజుల్లో భారతీరాజా తీసిన బ్లాక్ బస్టర్ సీతాకోక చిలుక మూవీతో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ప్రస్తుతం అగ్రశ్రేణి కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు. ఇతను ఉంటే సినిమాకు మినిమమ్ గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. తమిళ,కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అలీ,కమెడియన్ గానే కాదు హీరోగానూ మంచి పేరు కొట్టేసాడు.

యమలీల వంటి బ్లాక్ బస్టర్ ఆలీ ఖాతాలో ఉందంటే అతని రేంజ్ తెలుసుకోవచ్చు. అప్పట్లో పూట గడవని స్థితి నుంచి ప్రస్తుతం ఖరీదైన బంగ్లా లో ఉంటూ విలాసవంతమైన కార్లలో తిరుగుతున్న ఆలీ,పాత రోజులు మాత్రం మర్చిపోలేదు. పేదలకు తోచినంత సాయం చేస్తూ మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు.

తండ్రి పేరిట మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి,సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక మానవత్వాన్ని చాటుకుంటూ చేసిన ఓ పని అందరినీ కదిలిస్తుంది.అదేమిటంటే,సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి 50 లక్షలకు మోసం చేసాడట. లోక్ అదాలత్ లో అతనిపై పిర్యాదు చేసాడు ఆలీ. కేసు జరుగుతుండగా సదరు వ్యక్తి చనిపోయాడు.

రెండవ ముద్దాయిగా అతని భార్య వుంది. కేసు నడుస్తోంది. అయితే ఆస్తులన్నీ కరిగిపోయి ,తినడానికి కూడా తిండి లేని దీనావస్థకు ఆమె చేరడంతో విషయం ఆలీకి తెల్సింది. ఓ రోజు వాళ్ళింటికి వెళ్లి చూస్తే, ఆమె దయనీయ స్థితి చూసి,ఒక్కప్పుడు దర్జాగా బతికిన కుటుంబం ఇలా అయిపోయిందేంటి అనుకుని కంటతడి పెట్టుకున్నాడట.

వెంటనే తన లాయర్ ని పిలిపించి,కేసు విత్ డ్రా చేయమని చెప్పడమే కాకుండా, ఆమెకు కొంత డబ్బుని చెక్కు రాసి ఇచ్చాడట. ఇది చూసిన ఆమె భోరున విలపించిందట. .ఆ విధంగా తన పట్ల మోసపూరితంగా వ్యవహరించిన వాళ్లపట్ల తన పెద్దమనసుని చాటుకున్నాడు.