Movies

స్టార్ హీరోయిన్ అంజలి తల్లితండ్రులకు దూరంగా పిన్ని దగ్గర ఉండటానికి కారణం ఏమిటో తెలుసా?

అందంలోనే కాదు అభినయంలోనే టాప్ అయిన అంజలి దక్షిణాది భాషలన్నిటిలో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ అని చెప్పాలి. ఈ రాజోలు బ్యూటీకి వచ్చిన అవార్డులు అందుకు నిదర్సనం. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో అగ్రస్థానం పొందింది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈమె టాలీవుడ్ లో ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారంటే ఆమె రేంజ్ ఏమిటో చెప్పక్కర్లదు. అయితే టాలీవుడ్ లో సెటిల్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆరు చిత్రాలు సెట్స్ మీద వున్నాయి. స్టార్ హీరోయిన్ గా అంజలి ఎంతపేరు తెచ్చుకుందో కొన్ని వివాదాలతో డామేజ్ కూడా చేస్తుకుందని చెప్పాలి. 1986 సెప్టెంబర్ 11న తూర్పు గోదావరి జిల్లా రాజోజులో జన్మించిన ఈమె తల్లి పార్వతీ దేవి. తండ్రి ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లిపోవడంతో పిన్ని భారతీదేవి దగ్గర అంజలి పెరిగింది.

ఇద్దరు అన్నయ్యలు, ఓ అక్క గల ఈమె విద్యాభ్యాసం అంతా రాజోలులోనే సాగింది. ఇంటర్ తర్వాత పిన్నితో కల్సి చెన్నై వెళ్లిన అంజలి అక్కడ బీఎస్సీ పూర్తిచేసింది. డిగ్రీ చదువుతుండగానే సినిమాలపై ఆసక్తితో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. నిజానికి అంజలి పేరెంట్స్ ఇద్దరూ సినిమాల్లో నటించాలని కలలు కన్నారట. అయితే కుటుంబం గడవడమే భారంగా ఉండడంతో పొట్ట చేత్తో పట్టుకుని దుబాయ్ వెళ్లిపోయారు.

చివరికి తమ కూతురు అంజలి ద్వారా సినిమా కల నెరవేర్చుకున్నారు. 2002లో శత మెంట్రీ మత్తుమీదు చిత్రంలో నటించినా, అది మధ్యలోనే నిలిచిపోయింది.ఇక మోడలింగ్ తో ఉపాధి వెతుకున్న అంజలి, దర్శకుడు శివ నాగేశ్వరరావు కళ్ళల్లో పడడంతో 2006లో వచ్చిన ఫోటో మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది. అదే ఏడాది ప్రేమలేఖ రాసా అనే మరోచిత్రంలో నటించినా,ఆ తర్వాత తమిళంలో కాట్రేటు తమిళ్ అనే మూవీతో తొలిసారి సక్సెస్ రేటు చవిచూసింది.

జీవా హీరోగా వచ్చిన ఆ మూవీ డేర్ పేరిట తెలుగులోనూ రిలీజయింది. 2010లో వచ్చిన అంగాడి తేడు మూవీ అంజలిలోని అసలు సిసలు నటిని వెలికితీసిందని చెప్పాలి. అ మర్నాటి ఏడాది వచ్చిన ఎంగేయం ఎప్పోదం మూవీ తెలుగులో జర్నీ పేరిట వచ్చింది. ట్రాజికల్ లవ్ స్టోరీ కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో అంజలి నటనకు ప్రముఖుల ప్రశంసలు లభించాయి.

ఇక తెలుగులో స్ట్రెయిట్ గా చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సెన్షేషనల్ హిట్ కావడంతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఆ తర్వాత బలుపు, మసాలా మూవీస్ నిరాశపరిచాయి. ఆ తర్వాత చిన్న హీరోలతో అంటే గీతాంజలి, చిత్రాంగద వంటి మూవీస్ లో నటించి హిట్స్ అందుకున్న ఈమె ఆరు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

ఇక అప్పట్లో హోటల్ గది నుంచి అంజలి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియన్ కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పింది. అయితే ఆ సమయంలో ఓ టాలీవుడ్ ప్రముఖుడు అండగా నిలిచాడని, అతనితో ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి. ఇక ఆమె గ్యారేజిలోకి ఎం ఎం డబ్ల్యు కారు రావడంతో అతనే కొనిచ్చినట్లు టాక్ వచ్చింది.

ఆమెకు పెద్ద జబ్బు ఉందని, ప్రతి రోజూ ఓ మాత్ర వేసుకోవాలని, ఇక ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యునితో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి కూడానని వదంతులు వచ్చాయి. కాగా తమిళ నటుడు జైతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అంజలి, ఈ మధ్య అతని ప్రవర్తన అంటే తాగి తందానాలు ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన అతనికి బ్రేక్ అప్ చెప్పేసిందని, ఇక కెరీర్ పైనే దృష్టిపెట్టాలని భావిస్తోందట.