Movies

సినిమాలకు దూరం అయిన బాబు మోహన్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కమెడియన్ గా రాణించిన బాబూ మోహన్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు. కోట శ్రీనివాసరావుతో కల్సి నటించిన కామెడీ సీన్స్ తలచుకుంటే నవ్వుల్లో మునిగిపోతాం. అలాంటి బాబుమోహన్ గత నాలుగేళ్లుగా సినిమాలకు ఒక్క సినిమా చేయలేదు. సినిమాలకు దూరం అయిపోయిన బాబుమోహన్ ఎక్కడ ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. 1952 మార్చి 19న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీరోలు గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి టీచర్ గా పనిచేశారు. అక్కడే పదవతరగతి వరకూ చదివిన బాబూమోహన్ అనంతరం రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించాడు.

అయితే సినిమాల పిచ్చితో ఉద్యోగం వదిలేసి, ఛాన్స్ లకోసం చేసిన ప్రయత్నం ఫలించింది.ఈ ప్రశ్నకు బదులేది మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాబూ,ఆ తర్వాత మామగారు మూవీలో వేసిన బిచ్చగాడు పాత్ర మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక చాలా సినిమాల్లో అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, జంబలికడి పంబ, పెదరాయుడు వంటి సినిమాల్లో వేసిన పాత్రలతో బాబూమోహన్ కమెడియన్ గా టాప్ రేంజ్ కి వెళ్ళాడు.

తెలుగు తెరపై హాస్యనటునిగా ఓ వెలుగు వెలిగిన బాబూమోహన్ కి ఒకే ఒక కొడుకు.చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే బాబుకి వల్లమాలిన అభిమానం. అందుకే టిడిపిలో చేరి,1999 లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది,సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా కూడా పనిచేసాడు. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ చేతిలో ఓటమి చెందాడు.

అయితే 2009 అక్టోబర్ 13న హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో కొడుకు పవన్ కుమార్ మరణించడం, బాబూమోహన్ ని కుంగదీసింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. భార్య,కోడలు,మనవలతో కల్సి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న బాబూ, ఇక తాజాగా సినిమాలపై దృష్టి పెట్టారనే వార్తలు వస్తున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో టి ఆర్ ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన బాబూ వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమని అంచనాతో,సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుని, తనకు తెల్సిన సీనియర్ దర్శకుడు కె ఎస్ నాగేశ్వరరావు డైరెక్షన్ లో బిచ్చగాడా మజాకా అనే మూవీలో నటించాడు. బాబూ మోహన్ చుట్టూ తిరిగే ఈ సినిమా లో ఓ పాటకు చిందులు వేయించడంతో పాటు, ఓ పాట కూడా పాడించినట్లు బోగట్టా.