Movies

ఆహుతి ప్రసాద్ చనిపోతానని తెలిసి ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు ? నమ్మలేని నిజాలు

ఏ పాత్రనైనా అవలీలగా రక్తికట్టించగల నటుడు ఆహుతి ప్రసాద్. ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆహుతి ప్రసాద్ సడన్ గా చనిపోవడం అందరినీ కలచివేసింది. అయితే ఆయన ఎందుకు చనిపోయారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు లో 1958జనవరి న ఆహుతి ప్రసాద్ జన్మించారు. ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన ప్రసాద్ కి చిన్నప్పటినుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న ప్రసాద్,ఆతర్వాత కొంతకాలం దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ కి ఇంఛార్జిగా వ్యవహరించారు.ఆ తర్వాత కొద్దీ కాలానికే నాగార్జున ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ సినిమాలో ప్రసాద్ నటుడిగా రంగప్రవేశం చేసారు.

అయితే ఆతర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆహుతి సినిమాలో వచ్చిన గుర్తింపుతో అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా స్థిరపడ్డారు. ఆతర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతటి గుర్తింపు రాలేదనే చెప్పాలి. కొంతకాలం విశ్రాంతికే పరిమితం అయిపోయిన ప్రసాద్,ఆతర్వాత నాగార్జున హీరోగా కృష్ణవంశీ తీసిన నిన్నే పెళ్లాడతా మూవీతో క్యారక్టర్ నటుడిగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ అందుకున్నారు. ఆతర్వాత కృష్ణ వంశీ తీసిన చందమామ మూవీ ఆయన సినీ జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే అలాంటి పాత్రలో ఎప్పుడూ ఆయన్ని ఊహించుకోకపోవడంతో మంచి రేంజ్ లో గుర్తింపు లభించింది.

ఆ తర్వాత తండ్రి పాత్రలు, కామెడీ రోల్స్ , విలన్ రోల్స్ తనదైన శైలిలో రక్తికట్టించిన ఆహుతి ప్రసాద్ 122 చిత్రాల్లో నటించాడు. చందమామ మూవీలో నటనకు ఉత్తమ్ క్యారక్టర్ నటుడిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. రుద్రమదేవిలో ఓ కీలక పాత్ర పోషించిన ప్రసాద్ కి అదే చిట్టచివరి సినిమా.

సినిమాల్లో బానే నటిస్తున్నా, ఆయన్ని తెలియని స్కిన్ కేన్సర్ రూపంలో ఆయన్ని ఓ భూతం వెంటాడింది. నిక్కచ్చిగా వ్యవహరించే ప్రసాద్ కి ఎలాంటి వ్యసనాలు లేవు. అలాంటి వ్యక్తికి క్యాన్సర్ రావడం ఎవరికీ అర్ధం కాలేదు. పైగా క్యాన్సర్ సోకినట్లు ఆయనకు చాలా ఆలస్యంగా తెల్సింది.
కొంతమందికి విషయం తెల్సి పరామర్శకు వస్తే, ఎవరినీ కలవడానికి ప్రసాద్ ఇష్టపడలేదు.

ఆయనకు వచ్చిన స్కిన్ క్యాన్సర్ ఆపడం ఎవరి వల్లా కాదు. ఇక కొద్దిరోజులే అని డాక్టర్లు తేల్చేయడంతో ఆయనకు , ఆయన కుటుంబానికి గుండెల్లో పిడుగులు పడినట్లయింది. ఏ హాస్పిటల్ కి తిరిగినా, లేట్ చేసారు లాభం లేదనే మాట వినిపించడంతో ఇక అక్కడ ఉండకూడదని సొంతూరు కోడూరు వచ్చేసారు. అక్కడ చాలా కష్టంగా రోజులు గడిపారు.

ఫ్రెండ్స్ ని , సన్నిహితులను ఆయన కలవడానికి ఇష్టపడలేదు. సానుభూతి, జాలి అంటే ఆయనకు ఇష్టం లేదు. అందుకే కేవలం కుటుంబ సభ్యులతోనే చివరి రోజలు ఆయన పంచుకున్నారు. అయితే ఇక ఆఖరులో హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించినా, ఫలితం లేకపోయింది. ఆయన మరణించేవరకూ ఆయనకున్న వ్యాధి గురించి ఎక్కువమందికి తెలియలేదు. అందుకే ఆయన మరణించారన్న వార్తతో అందరూ అవాక్కయ్యారు. ఇక ఆయన పోయినా,ఆయన నటించిన సినిమాలు ఆయన్ని సజీవంగానే ఉంచుతాయి.