Politics

జగన్ పై నాగబాబు ఫైర్… నా తమ్ముడికి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలుసుకొని మాట్లాడు

కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై YSR కాంగ్రెస్ అధినేత జగన్ ఓ రేంజ్ లో విరుచుకు పడిన సంగతి మనకు తెలిసిందే. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యను మారుస్తాడు. కారును మార్చినంత ఈజీగా భార్యలను మారుస్తాడని తీవ్రమైన వ్యాఖ్యలను చేసాడు. పవన్ ఈ విషయంపై స్పందించిన జగన్ వ్యక్తిగత జీవితం గురించి కాకుండా రాజకీయ జీవితం గురించి ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇప్పుడు పవన్ కి మద్దతుగా పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు తెరపైకి వచ్చారు. జగన్ మాట్లాడిన మాటలు ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు కాదని నాగబాబు అన్నారు. పార్టీ అధ్యక్షుడు జాగ్రత్తగా లేకుండా నోరు జారితే మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

తొందరపాటుతో ఎదో ఒకటి మాట్లాడటం సరి కాదని నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ పెళ్లిళ్ల గురించి సరిగా తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవటం మంచిదని, తెలియకుండా ఎదో మాట్లాడటం మంచి పద్దతి కాదని అన్నారు. పవన్ పెళ్లి చేసుకుంటానని ఎవరిని మోసం చేయలేదని,ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడని, అది పవన్ వ్యక్తిగత విషయం.

అంతేకాదు పవన్ లీగల్ గానే విడాకులు తీసుకున్నాడు. ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవరీసీలు లేవు. ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగిందని భావిస్తే పవన్ మొదటి భార్య కానీ,రెండో భార్య రేణు దేశాయ్ కానీ బయటకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పటికి రేణు దేశాయ్ పవన్ గురించి నెగిటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు.

లీగల్ గా విడిపోయి తన మానాన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటని నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనవసరంగా నోరు పారేసుకుంటే జగన్ లాంటి వ్యక్తికీ తగదని చెప్తూ పవన్ రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.

పవన్ రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు లేవని…అందుకే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు నాగబాబు. పవన్ రాజకీయంగా ఎదిగితే తన భవిష్యత్ కి భంగం కలుగుతుందని భయపడి జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాగబాబు తీవ్రస్థాయిలో ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది పవన్ అని నాగబాబు అన్నారు. దీనిని ఎవరు ఆపలేరని అన్నారు.