Politics

అంబానీ కూతురు ఇషా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు ముఖేష్ అంబానీ పేరు. సుమారుగా మూడు లక్షల కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ముఖేష్ అంబానీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయన పిల్లలు కూడా తండ్రిని అనుసరించి వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ రిలయన్స్ ని ప్రపంచ పటంపై ప్రముఖ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ముఖేష్ కూతురు ఇషా అంబానీ తన ఆలోచనలతో మహామహులనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో టెలికాం ఆలోచన ఇషా అంబానీదే. జియో ఆమె ఆలోచనల నుండి పుట్టింది. జియో టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.

ఇషా అంబానీ 1991 అక్టోబర్ 23 న ముంబైలో జన్మించింది. తన సొంత స్కూల్ ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది. స్కూల్ డేస్ లో ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యాక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ ని పొందింది. వ్యాపారంలో అనుభవం కోసం న్యూయార్క్ లో ఒక సంస్థలో బిజినెస్ ఎనలిస్ట్ గా పనిచేసింది.

అనుభవం సంపాదించాక తమ సొంత సంస్థలు అయినా రిలయన్స్ రిటైల్, జియోలలో బోర్డ్ మెంబెర్ గా ఎంటర్ అయింది. 17 సంవత్సరాల వయస్సులోనే ఫోబ్స్ మ్యాగజైన్ ఇషా గురించి స్పెషల్ ఆర్టికల్ రాసింది. సాధారణంగా ఆ వయస్సులో ఉన్న అమ్మాయిలు ఫ్యాషన్, సినిమాలు అంటూ కాలక్షేపం చేస్తే ఇషా మాత్రం తెలివి ఉంటే డబ్బు ఎలా సంపాదించవచ్చో అనే ఆలోచనలతో ఇషా ఉందని ఫోబ్స్ వివరించింది. అంతేకాకుండా 70 మిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిగా పేరు పొందింది. ఇషాదగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి.