Movies

హీరో నుంచి కమెడియన్ గా మారిన తగ్గని సునీల్ క్రేజ్… అరవింద సమేత పారితోషికం ఎంతో తెలుసా?

కమెడియన్ సునీల్ అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న సిల్లీ ఫెలౌస్ సినిమాలో ఫుల్ లెన్త్ కమెడియన్ గా సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో కూడా కమెడియన్ గా సునీల్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు హీరోగా చేసిన సునీల్ కమెడియన్ గా నటిస్తున్న ఈ సినిమాలకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో అనే విషయం మీద జోరుగా చర్చ సాగుతుంది. హీరోగా చేసినప్పుడు సునీల్ సినిమాని బట్టి పారితోషికం తీసుకునేవాడు. అయితే అరవింద సమేత సినిమాలో సునీల్ కళ్ళు చెదిరే పారితోషికం తీసుకుంటున్నాడు. సునీల్ మొదట్లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి హీరోగా మారాడు.

హీరోగా చేసిన కొన్ని సినిమాలు హిట్ అయినా ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమి హిట్ కాకపోవటంతో, కాస్త ఆలోచనలో పడి మరల కమెడియన్ గా మారాడు. అరవింద సమేత సినిమాలో సునీల్ కోసం త్రివిక్రమ్ ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ని సృష్టించాడట. సునీల్,త్రివిక్రమ్ స్నేహితులు. దాంతో స్నేహితుడి కోసం ఫుల్ లెన్త్ పాత్రను రాసాడట త్రివిక్రమ్.

హీరో కనిపించినంత సేపు సునీల్ కూడా సినిమాలో కనిస్తాడట. కమెడియన్ నుండి హీరోగా…హీరో నుండి కమెడియన్ గా మారిన తర్వాత కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అరవింద సమేత సినిమాకి సునీల్ కోటి రూపాయిల పారితోషికం తీసుకుంటున్నాడట.