Movies

రచ్చ రవి గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అనుభవజ్ఞులు నటన అంటే వృత్తి కాదని పిచ్చి అని అంటారు. మనిషిలో ఆ వ్యామోహం కలిగితే వ్యసనం కంటే బలంగా ఉంటుందని, దాన్ని నుంచి బయట పడటం అంతా సులువు కాదని ఏ నటుణ్ని అడిగిన చెప్పుతారు. అందుకే నటన మీద మక్కువతో ఇల్లు వదిలి రావటానికి అయినా సిద్దపడిపోతారు. అలాంటి వారిలో రచ్చ రవి ఒకరు. రచ్చ రవి జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రవి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రచ్చ రవి స్వస్థలం వరంగల్ జిల్లా హనుమకొండ. రచ్చ రవి తండ్రి సాధారణ కారు డ్రైవర్. తండ్రి డ్రైవర్ అని చెప్పుకోవటానికి ఇబ్బంది పడిన రచ్చ రవి, తన తండ్రి SCO అని చెప్పుకొనేవాడు.
Racha Ravi
SCO అంటే స్టీరింగ్ కంట్రోల్ ఆపరేటర్ అని అర్ధం. తన తండ్రి డ్రైవర్ అని చెప్పితే అందరు చిన్నచూపు చూసారని,అందుకే SCO అని చెప్పే వాడినని, మ నాన్న మమ్మల్ని ఎంతో కస్టపడి చదివించాడు. రవి ఇంటర్ వరకు వరంగల్ లోనే చదివాడు. ఆ తర్వాత ప్రైవేట్ గా MBA చేసాడు. ఆ సమయంలో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
Racha Ravi 1
చదువుకొనే రోజుల నుంచి సినిమా పిచ్చి ఉండటంతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నందుకు ఇంటిలో వాళ్ళందరూ చెడా మడా చివాట్లు పెట్టేసారు. ఇంటిలో వారికీ ఎదో విధంగా నచ్చచెప్పి ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హైదరాబాద్ చేరుకున్నాడు. ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసున్న రచ్చ రవికి అనుకోకుండా జాక్ పాట్ తగిలింది.

దుబాయ్ లో ఉన్న ఒక రేడియో స్టేషన్ లో నెలకు లక్ష రూపాయిల జీతంతో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొంతకాలం పనిచేసాక మరల సినిమాల మీదకు మనస్సు లాగటంతో మరల హైదరాబాద్ వచ్చి జెమినీ టివిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.

అక్కడ ఉన్నప్పుడే 2013 లో జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. ఇక రవి దశ తిరిగిపోయింది. దాదాపుగా 250 ఎపిసోడ్స్ చేసిన రచ్చ రవి 45 సినిమాల్లో నటించాడు. రచ్చ రవి వెయ్యి అబద్దాలు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.