Politics

కళ్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున

అక్కినేని నాగార్జున నటుడిగా,నిర్మాతగానే కాకుండా ఓ ప్రముఖ జువెలర్స్ బ్రాండుకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. గత కొంత కాలం నుండి నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ బ్రాండుకు ప్రచారకర్తగా ఉన్నారు. దాంతో తెలుగు రాష్ట్రాలకు కళ్యాణ్ జువెలర్స్ మంచి పాపులారిటీ వచ్చింది. దాంతో వారు నాగార్జునతో అనేక రకాలుగా యాడ్స్ తీసి జనాలలోకి ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కళ్యాణ్ జువెలర్స్ వారు నాగార్జునతో చేసిన యాడ్ వివాదం అయింది. ఈ యాడ్ తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళంలో కూడా వివాదానికి దారి తీసింది. హిందీ, తమిళం, మలయాళంలో అమితాబ్ బచ్చన్ చేస్తుండగా… తమిళంలో ప్రభు చేస్తున్నారు. ఈ యాడ్ లో బ్యాంకింగ్ సిబ్బందిని తప్పుగా చూపించారన్న విమర్శలు వ్యక్తం కావటం మరియు వివాదం పెద్దది కావటంతో కళ్యాణ్ జువెలర్స్ సంస్థ ఆ యాడ్ ను వెనక్కి తీసుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ వివాదంపై నాగ్ కూడా స్పందించారు.

తనకు కళ్యాణ్ సంస్థ నుండి ఒక లెటర్ వచ్చిందని అందులో.. ఈ యాడ్ ను వెనక్కి తీసుకుంటున్నామని..ఇందులో మిమ్మల్ని యాక్ట్ చేయించినందుకు సారీ చెబుతున్నాం అని ఆ లెటర్ లో ఉంది. మీడియా వారు అడిగిన ప్రశ్నకు గాను నాగ్ ఈ విషయం చెప్పారు.

ఇక నేను ఈ యాడ్ తో నటించక ముందు అమితాబ్ బచ్చన్.. ప్రభు ఇదే ప్రకటన చేశారని.. వాళ్ల తర్వాతే తాను నటించానని చెప్పారు. ఈ వివాదం పక్కన పెడితే తనకు ఈ యాడ్ బాగా నచ్చింది. ఇందులో తానూ కొత్తగా కనిపించానని చెప్పారు నాగ్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."