Movies

పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మొదటి సినిమా హీరోయిన్ సుప్రియ

పవన్ కళ్యాణ్, సుప్రియ హీరో,హీరోయిన్ గా నటించిన ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా వచ్చి దాదాపుగా 22 సంవత్సరాలు అయింది. ఈ సినిమా తర్వాత మరొక సినిమాలో నటించలేదు. ప్రస్తుతం సుప్రియ సినిమాలకు దూరం కాలేదు. ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన పనులు చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తున్నది. ఇప్పుడు గూఢచారి సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది సుప్రియ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నదియా ఖురేషి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుప్రియ నటనను అనేక మంది సెలబ్రిటీలు మెచ్చుకుంటూ మెసేజ్ లు చేయటంతో సుప్రియ ఆనందానికి అవధులు లేవట.

ఈ విషయాన్ని సుప్రియ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉంచితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదని..ఫస్ట్ ఫిల్మ్ సమయంలో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పింది.

ఇప్పటికి పవన్ కళ్యాణ్ తనను హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారని చెప్పింది సుప్రియ. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిగా తన జర్నీని కంటిన్యూ చేస్తానని చెప్తున్నది. నెగెటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ అంటే ఇష్టమని ఆ తరహా పాత్రలు వస్తే అసలు వదిలిపెట్టమని తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రియ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."