Devotional

వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేస్తే సకల ఐశ్వర్యాలు,కోటి జన్మల పుణ్యం దక్కుతుందో తెలుసుకోండి

శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవాతం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆ కథను విన్నా శుభం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందు రోజు ఇల్లు అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పూజకు సిద్ధం కావాలి. ఈ వ్రతాన్ని ఈశాన్యంలో చేసుకోవాలి. ఈశాన్యంలో ముగ్గు వేసి మండపం ఏర్పాటు చేసుకోవాలి. శ్రావణ మాసం అంటే లక్ష్మి దేవికి చాలా ఇష్టం. ఎందుకంటే మన పురాణాల ప్రకారం శుక్రవారం శుక్రాచార్యుని పేరు మీద ఏర్పడిందని చెపుతున్నాయి. శుక్రాచార్యుని తండ్రి భృగు మహర్షి. ఈ భృగు మహర్షి బ్రహ్మ కుమారుల్లో ఒకరు. లక్ష్మి దేవి తండ్రి భృగు మహర్షి. ఈ లెక్కన చూస్తే లక్ష్మి దేవికి శుక్రాచార్యుడు సోదరుడి వరుస అవుతారు.

అందువల్ల లక్ష్మి దేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లోనూ పూజ చేసుకుంటారు. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి సమయం కూడా ఉంటుందని మీకు తెలుసా? కొన్ని సమయంల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఆ సమయాల గురించి తెలుసుకుందాం.

సింహ లగ్న పూజ ముహర్తం 6. 04 నుండి 7.41 మధ్య
వృచ్చిక లగ్న పూజ ముహర్తం 11. 56 నుండి 2. 20
కుంభ లగ్న పూజ ముహర్తం సాయంత్రం 6. 07 నుండి 7. 47
వృషభ లగ్న పూజ ముహర్తం రాత్రి 11.06 నుండి 1.06

ఈ సమయాలలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుంది.

ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు,పండ్లు,నైవేధ్యాల గురించి తెలుసుకుందాం.

ఆవు పాలు, ఆవు నెయ్యితో తయారుచేసిన బియ్యం పరమాన్నం అంటే చాలా ఇష్టం. ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇంకా శక్తి కొలది నైవేద్యాలను పెట్టవచ్చు. కానీ ఎన్ని నైవేద్యాలు పెట్టిన బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి.

అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు,బిల్వ పత్రాలతో పూజ చేయాలి. అంతేకాక అందుబాటులో ఉన్న ఎరుపు,పసుపు,ఆకుపచ్చ,తెలుపు పువ్వులతో పూజ చేయాలి.

అమ్మవారికి కొబ్బరికాయ, అరటి పండ్లు అంటే ఇష్టం. వీటితో పాటు దానిమ్మ,బత్తాయి,ఆపిల్,పంపర పనస వంటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కాళ్ళకు పసుపు,మెట్టెలు, ముఖం మీద కుంకుమ బొట్టు,కళ్ళకు కాటుక,తలలో పువ్వులు,చేతికి గాజులు,కొత్త చీర కట్టుకోవాలి. అమ్మవారి పూజలో కొత్త బంగారు నగను పెట్టి పూజ చేసి ఆ తర్వాత ధరించాలి. ఈ విధంగా పూజ చేస్తే కోరిన సంపద,సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు.