Movies

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మీకు తెలియని సీక్రెట్స్

మెగాస్టార్ చిరంజీవి ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవి వివాహం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి సుస్మిత,శ్రీజ అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 63 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయన 35 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. ఎన్నో రివార్డ్స్,అవార్డ్స్ అందుకోవటమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

చిరంజీవి నటన,డాన్స్ గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే చిరంజీవికి ఇష్టమైన విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. చిరంజీవికి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టమట. చిన్నతనంలో కెమెరా కొనుక్కోవటం కుదరలేదట. సినిమాల్లోకి వచ్చాక ఫొటోగ్రఫి కోరికను తీర్చుకున్నారట.

చిరంజీవి చేతి రాత అసలు బాగోదట. అయన రాసింది అయన చదవటమే కస్టమట. అందుకే సమయం చిక్కినప్పుడల్లా చేతి రాత ప్రాక్టీస్ చేస్తారట.
చిరంజీవికి మెదడు పదును పెట్టె అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టమట. నాన్న నాకు హీరో. కానీ అమ్మ దగ్గర చనువెక్కువ.

నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్లి అడిగేవాడిని. నాన్న అంటే తిడతారనే భయం. కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతి సారి- బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవి తెలిపారు. నా వ్యక్తిగత జీవితం వేరు. వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.

ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సైరా సినిమా హిట్ కావాలని కోరుకుందాం.