Movies

విక్టరీ వెంకటేష్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా….నమ్మలేని నిజాలు

కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వెంకటేష్ పూర్తి పేరు దగ్గుపాటి వెంకటేష్. వెంకటేష్ ను ఇంటిలో ముద్దుగా వెంకి అని పిలుస్తారు. ఇక అభిమానులు అయితే విక్టరీ అని పిలుస్తారు. వెంకటేష్ ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో డిసెంబర్ 13, 1960 లో జన్మించాడు. వెంకటేష్ తండ్రి ప్రముఖ నిర్మాత రామానాయుడు, తల్లి రాజేశ్వరి. వెంకటేష్ అన్న,చెల్లి ఉన్నారు. వెంకటేష్ భార్య పేరు నీరజ. వీరికి ముగ్గురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్నారు.

వెంకటేష్ అమెరికా వెళ్లి MBA చేసాడు. 1986 లో ‘కలియుగ పాండవులు’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసాడు. తను నటించిన మొదటి సినిమా హిట్ కావటమే కాకుండా నంది అవార్డ్ కూడా వచ్చింది. 1988 లో వచ్చిన ‘ప్రేమ’ సినిమా ద్వారా మరో నందిని గెలుచుకున్నాడు. 1991 లో వచ్చిన ‘చంటి’ సినిమా హిందీలో ‘అనారి’ గా రీమేక్ అవటంతో వెంకటేష్ హిందీలోకి కూడా వెళ్లినట్టు అయింది. ఆ సినిమాలో వెంకటేష్ సరసన కరిష్మా కపూర్ నటించింది.
Venkatesh And Neeraja
ఇప్పటివరకు 72 సినిమాల్లో నటించిన వెంకటేష్ కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేయటంలో ముందు ఉంటాడు. తన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడు. వెంకటేష్ అభిమానులు ఎక్కువగా మహిళ అభిమానులే. ఇప్పటివరకు వెంకటేష్ 7 నందులను గెలుచుకున్నాడు. సినిమాలు తర్వాత వెంకటేష్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే CCL తెలుగు వారియర్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు.