Kitchen

జిల్లేడు కాయలు

కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ: 2 కప్పులు
తరిగిన బెల్లం: 1 కప్పు
పచ్చికొబ్బరి తురుము: 2 కప్పులు
గసగసాలు: 1గ్రా.
బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్‌: 2
నెయ్యి: కొద్దిగా
యాలకుల పొడి : ‘

తయారు చేసే పద్ధతి
ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి.ఇప్పుడు మరో గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్సి్న, వేయించిన గసగసాలు యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకుని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని , ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చాల్లారిన తర్వాత నైవేద్యం సమర్పించాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."