Movies

ఈ విలన్ టాలీవుడ్ లో స్టార్ హీరోకి బావ… ఆ హీరో ఎవరో తెలుసా?

పుట్టుకతోనే వచ్చే జీన్స్ ని బట్టి అతని మనుగడ ఉంటుంది. నటనా లక్షాణాలు ఉంటె ఏదోవిధంగా రాణిస్తారు కూడా .. అందుకే తలరాతను తప్పించలేం అంటారు మన పెద్దలు. రాసిపెట్టి ఉంటే, హీరోగా, హీరోయిన్ గా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా,సైద్ ఆర్టిస్టుగా,ఇలా ఏదోరకంగా సినీమాల్లో రాణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ నటుడి గురించి వివరాల్లోకి వెళ్తే,మొదట్లో పంపిణీ దారుగా ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఆతర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు తీసిన ఇతను అనంతరం అనుకొకుండా సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. విలన్ గా తన విశ్వరూపం చూపించాడు.

ఇక్కడితో ఆగలేదు, హీరో హీరోయిన్ తర్వాత అందరినీ భయపెట్టే విలన్ పాత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ అంటే భయంకర రూపం,భారీ శరీరం,పెద్ద మీసాలు, కండలు తిరిగిన ఒళ్ళు అనుకుంటే పొరపాటేనని ఈ విలన్ నిరూపించాడు. కానీ కళ్ళు, జుట్టుతో భయపెడుతూ రాణించిన ఈ నటుణ్ని చూస్తే అసలు సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడా అని అనుకోవడం సహజం.

అవును ఇంతలా ఎదిగిన విలన్ ఎవరంటే, కె. అశోక్ కుమార్. ఈయన హీరో వెంకటేష్ హీరోగా రక్త తిలకం మూవీతో హిట్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు. ఇక ‘చెవిలో పువ్వు’ సినిమా నిర్మిస్తున్న సమయంలో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అక్కడకు వచ్చి, తన చిత్రంలో నటించాలని కోరడంతో అశోక్ కుమార్ కి ఆశ్చర్య పోయాడు.

అసలు నాకు నటన అంటే ఏమిటో తెలీదు, అలాంటిది నేను నటించాలా అని అనేయడంతో ‘నువ్వు ఎలాంటి పాత్రలకు సరిపోతావో నాకు తెల్సు .అందుకే అడుగుతున్నా, ఒప్పుకో . మిగిలింది నేను చూసుకుంటా”అని కోడి రామకృష్ణ హితబోధ చేసారు. ఆ విధంగా కోడి రామకృష్ణ తాను డైరెక్ట్ చేస్తున్న భారత్ బంద్ మూవీలో అశోక్ కుమార్ ని విలన్ పాత్ర కి ఎంపిక చేసాడు.

ఇలా ఏకోశానా సినిమాల్లో నటించాలన్న కోరిక లేని అశోక్ కుమార్ యాదృచ్చికంగా సినీమాల్లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. తెలంగాణ యాసలో ‘పోలీసులను కూడా, ఏం చేస్తావో చేసుకో,తేడా వస్తే లేపేస్తా’ వంటి డైలాగులతో మెప్పించాడు. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ మూవీలో వేసిన విలన్ రోల్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.

‘ప్రేమిచుకుందాం రా, అంతపురం,టక్కరి దొంగ,ఆటో డ్రైవర్, జయం మనదేరా,ఈశ్వర్ చిత్రాల్లో నటించిన అశోక్ కుమార్, నిర్మాతగా రక్త తిలకం,దృవ నక్షత్రం, చెవిలో పువ్వు,ప్రేమంటే ఇదేరా,ఈశ్వర్ లాంటి భారీ చిత్రాలు నిర్మించారు. విలన్ పాత్రలతోనే కాకుండా, పలు చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ఇంతకీ అశోక్ కుమార్ నిర్మాత గా మారడానికి మూవీ మొఘల్,స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కారణం. ఇందుకు వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే అశోక్ కి స్వయానా రామానాయుడు మేనమామ. ఈవిధంగా విక్టరీ వెంకటేష్ కి బావ అవుతాడు.