Politics

పాదయాత్రలో జగన్ దినచర్య ఎలా ఉంటుందో చూడండి

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ జనంలోకి వెళ్ళడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న వైస్సార్ సిపి అధినేత జగన్ జోరుగానే సాగుతోంది. గత నవంబర్ 5న ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సాగుతోంది. విశాఖ జిల్లాలో అనూహ్యంగా అభిమానులు ,ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం కోర్టుకి హాజరవ్వడం, వర్షం, పండుగలు ఇలా మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటున్నప్పటికీ పాదయాత్ర కొనసాగుతోంది.

ఇక పాదయాత్ర సందర్బంగా జగన్ నిత్య జీవితం ఎలా సాగుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. పాదయాత్రలో ఆయన దినచర్య సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం 4న్నర గంటలకు నిద్ర లేస్తారు. వ్యాయాయం,ధ్యానం చేస్తారు. కాలకృత్యాలు పూర్తయ్యాక ప్రజల నుంచి పిటీషన్స్ అందుకుంటారు.

తనకోసం వచ్చిన నేతలను కలుసుకుని,స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఉదయం 8న్నరకు పాదయాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 7న్నర గంటల వరకూ పాదయాత్ర సాగుతుంది. ఇక తాను నడిచే దారిలో ఎక్కువగా గ్రామాలుంటే,రోజుకి 10కిలోమీటర్లు,ఒకవేళ తక్కువ గ్రామాలుంటే 14నుంచి 15కిలోమీటర్లు జగన్ నడుస్తారు. ఆయన భోజనంలో మాంసాహారం ఉండదు. అల్పాహారమే తీసుకుంటున్నారు. ఆతర్వాత పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు.

రాత్రి పూజ అప్పుడప్పుడు ఎగ్ బజ్జి తీసుంటారు. లేకుంటే సాధారణ శాఖాహారం స్వీకరిస్తారు. మధ్యాహ్నం టెంటులోనే భోజనం,విశ్రాంతి పూర్తిచేస్తారు. అక్కడే నాయకులను,ప్రజలను కలుస్తారు. రాత్రి పూట ఆ టెంట్ లోనే సాధారణ వ్యక్తిలా పడుకుంటారు. ఐతే కాలకృత్యాలు తీర్చుకోడానికి, స్నానం చేయడానికి ఓ బస్సుని ఏర్పాటుచేసారు.