Movies

వెంకటేష్ గురించి నమ్మలేని నిజాలను బయట పెట్టిన రామ్ చరణ్

స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి వెంకటేష్ ఎన్నో విజయవంతమైం చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేస్తారు. శోభన్ బాబు,తర్వాత హీరో వెంకటేష్ కి మహిళా ప్రేక్షకాదరణ ఎక్కువ. కలియుగ పాండవులు మూవీతో తెలుగు వెండితెర మీద మెరిసిన వెంకటేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ విక్టరీ వెంకటేష్ గా జన హృదయాల్లో నిలిచారు. అయితే వెంకటేష్ ని పిసినారి అంటూ రామ్ చరణ్ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.

తన తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలతో పోలిస్తే,ఎక్కువగా కుటుంబ కదా చిత్రాల్లో చేయడమే కాదు,సక్సెస్ ఫుల్ హీరోగా వెంకటేష్ ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్నారు. అభిమానులు ఆప్యాయంగా వెంకీ అని పిలుచుకుంటారు. విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి, తనకన్నా వెనుకటి తరం వారి పక్కన నటించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి హీరోగా ఈ తరంలో ముద్రపడ్డారు.

గోపాలా గోపాలా మూవీలో పవన్ కళ్యాణ్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్ బాబుతో,మసాలా చిత్రంతో రామ్ తో కల్సి మల్టీ స్టారర్ మూవీస్ లో నటించిన వెంకీ తాజాగా మెగా ఫామిలీ కి చెందిన వరుణ్ తేజ్ తో కల్సి మల్టీ స్టారర్ చేస్తున్నాడు. వరుణ్ కి మేనమామ పాత్రలో తన నటనను కొత్తకోణంలో ఆవిష్కరించబోతున్నాడు.

సినిమాల్లో జోష్ గా ఉన్నట్టే వ్యక్తిగత జీవితంలోనూ అలానే ఉంటూ వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ వస్తున్నాడు. ఇక తన ఫామిలీ ని కూడా బయటకు తీసుకు రావడానికి ఇష్టపడడు.మెగాస్టార్ తో ఎక్కువ అనుబంధం గల వెంకీతో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు.

వీలుచిక్కితే చాలు వెంకీ ఇంటి దగ్గర వాలిపోతుంటాడు చెర్రీ, అయితే ఈ మధ్య చెర్రీ ఓ సంచలన ప్రకటన చేసాడు. వెంకటేష్ లాంటి పిసినారిని నేను ఎక్కడా చూడలేదంటూ చేసిన కామెంట్ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎందుకు ఇలా అన్నాడా అని ఆరా తీస్తే, తిండి విషయంలో పిసినారిగా వెంకీ ఉంటాడని అందుకే, యువకునిగా స్లిమ్ గా ఉంటాడని అసలు విషయం చెర్రీ చెప్పుకొచ్చాడు.