పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవి కొడుకుకి హీరోయిన్ కల్యాణికి సంబంధం ఏమిటో తెలుసా?
సాడిస్ట్ భర్త వలన సమాజంలో చాలామంది నలిగిపోతున్నారు. సినిమా స్టార్స్ కూడా దీనికి మినహాయింపు కాదని ఒకప్పటి స్టార్ హీరోయిన్ గురించి తెలిస్తే అర్ధం అవుతుంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన పసివాడి ప్రాణం సినిమా అప్పట్లో ఓ సంచలన విజయం. ఇక అందులో ఓ బాబు చుట్టూనే కథ నడుస్తుంది. మూగ, చెవుడు పాత్రలో నటించి మెప్పించిన ఆ బాబు పాత్రలో నటించింది బాబు కాదని ఓ పాప అని ఆతర్వాత తెల్సింది. అలా నటించిన ఆపాప పేరు సుజిత. నిజానికి 41రోజుల పసికందుగా ఉండగానే అబ్బాస్ అనే మూవీతో వెండితెరపై కనిపించిన సుజిత బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కేరళకు చెందిన ఈమె తెలుగు, తమిళం,కన్నడ ,
మలయాళ భాషా చిత్రాల్లో బాలనటిగా పాపులర్ అయింది. వందకుపైగా సీరియల్స్,సినిమాలో నటించింది.ఇక సుజిత కు ఓ అన్న ఉన్నాడు. అతని పేరు సూర్య కిరణ్. అతనికి డైరెక్టర్ అవ్వాలని పిచ్చి. పెద్ద డైరెక్టర్ గా ఫీలవుతూ చెల్లిని వేధిస్తూ,ఆమె సంపాదనపైనే ఆధారపడేవాడని చెబుతారు. నాగార్జున నటించిన అజిత్ చిత్రంలో చెల్లెలుగా వేసిన సుజిత ఆసమయంలో తన అన్న సూర్య కిరణ్ ని పరిచయం చేసింది.
కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో దిట్టగా పేరొందిన నాగార్జున తన మేనల్లుడు సుమంత్ హీరోగా జెనీలియా జంటగా సూర్య కిరణ్ డైరెక్షన్ లో సత్యం సినిమా తీసాడు. సత్యం మూవీతో మంచి పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ ఆతర్వాత సుమంత్ తో ధన 150, జగపతి బాబుతో భ్రహ్మస్త్రం,మంచు మనోజ్ తో రాజా భాయ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవ్వడంతో టాలీవుడ్ లో అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఇక తానే హీరోగా కన్నడ మూవీ చేసిన సూర్యకిరణ్ కి అదీ బెడిసి కొట్టేసింది. ఇక ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో తెలుగు, తమిళ,మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ నటిస్తున్న నటి కళ్యాణితో సూర్యకిరణ్ కి పరిచయం ఏర్పడింది. నిజానికి కళ్యాణి కూడా బాలనటిగానే ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత హీరోయిన్ గా తనసత్తా చాటుకుంది.
ఇక సుజితకు హాట్ ఫిలిం మేకర్ గణేష్ ని పెళ్ళాడి వెళ్లపోవడంతో సూర్య కిరణ్ కి ఆర్ధిక ఇబ్బందులు కూడా వెంటాడాయి. ఇక సూర్య కిరణ్, కళ్యాణి ప్రేమించి,పెళ్లిచేసుకోవడం, ఆతర్వాత కళ్యాణి సినిమాలకు గుడ్ బై చెప్పడం జరిగాయి. అయితే కొన్నాళ్లకే సూర్య కిరణ్ నిజ స్వరూపం బట్టబయలు అయింది.
సినిమాల్లో అవకాశం ఇప్పించాలని వేధించే భర్త సూర్య కిరణ్ శాడిజం భరించలేక తానే ప్రొడ్యూసర్ గా మారి ఓ చిత్రం తీసింది. తన సంపదనంతా పెట్టుబడిగా పెట్టి చాప్తర్ సిక్స్ మూవీని సూర్య కిరణ్ డైరెక్షన్ లో తీసింది. ఎంతచేసినా భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో పాపం కళ్యాణి వేషాలకోసం బయటకు వచ్చింది. ఆవిధంగా సపోర్టింగ్ రోల్స్ వేస్తూ ,బుల్లితెరమీద పలు షోలు చేస్తూ నెట్టుకొస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కళ్యాణి తాను ప్రేమించి పెళ్లాడిన భర్త సూర్యకిరణ్ శాడిజం భరించలేక ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు వేయడానికి సిద్ధమైంది.