Movies

నాగసౌర్య మేనత్త టాప్ హీరోయిన్… ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా? నమ్మలేని నిజాలు

మినిమమ్ గ్యారంటీ గల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వర్ధమాన నటుడు నాగసౌర్య 1989 జనవరి 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. విజయవాడలో స్టడీస్ పూర్తిచేసిన ఈ స్మార్ట్ హీరో కాలేజీ డేస్ లో స్పోర్ట్స్ లో రాణించాడు. రాష్ట్రస్థాయిలో టెన్నీస్ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచాడు. అయితే క్రికెట్ గాళ్స్ అండ్ బీర్ చిత్రం ద్వారా వెండితెరమీద మెరిసిన ఈ యువ హీరో ఊహలు గుసగుస లాడే,దిక్కులు చూడకు రామయ్యా,తదితర చిత్రాలతో తనకంటూ గుర్తింపు ఓ ఇమేజి ఏర్పరచుకున్నాడు.

క్రీడల్లో రాణిస్తూ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన రావడంతో టెన్నీస్ కి గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ చేరిన నాగసౌర్య దాదాపు ఐదేళ్లు తెగ కష్టపడ్డాడు. మొత్తానికి క్రికెట్ గాళ్స్ అండ్ బీర్ మూవీలో హీరోగా ఒకనిగా సెలెక్ట్ అయ్యాడు. క్రిటిక్స్ నుంచి కామెంట్స్ ఈ మూవీకి బానే వచ్చినా నాగసౌర్యకు పెద్దగా పేరు రాలేదు. ఇక వారాహి చలన చిత్ర సంస్థ ఆడిషన్స్ లో టాలెంట్ చూపించి,ఊహలు గుసగుసలాడే మూవీలో ఛాన్స్ కొట్టేసాడు.

నాగసౌర్య అక్కడనుంచి ముందుకు దూసుకుపోవడంతో అతని పేరెంట్స్ ఉషాబాల, శంకర్ ప్రసాద్ ప్రొడ్యూసర్స్ అయిపోయారు.యమలీల మూవీలో యముడిని తన హొయలుతో బురిడీ కొట్టించిన లతాశ్రీ ఇక నాగసౌర్య కు మేనత్త అని తెలియవచ్చింది. ఈమె ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగింది.

సూపర్ స్టార్ కృష్ణ మూవీస్ లో ఎక్కువగా కనిపించిన ఈమె అందాల ఆరబోతలోనూ ఇతర హీరోయిన్స్ కి ధీటుగా నటించింది. క్యారక్టర్ ఆర్టిస్టుగా నెంబర్ వన్,యమలీల,ఆ ఒక్కటి అడక్కూ వంటి మూవీస్ ఆమెకు ఎంతోపేరు తెచ్చాయి. అయితే లతాశ్రీకి,నాగసౌర్య కుటుంబానికి విబేధాలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె పేరు ఎక్కడా చెప్పకుండా ఐదేళ్లు కష్టపడి పైకి ఎదిగాడు నాగ సౌర్య.