Movies

రవితేజకి హీరోగా పెద్ద బ్రేక్ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

ఏ రంగంలోనూ లేనన్ని సెంటిమెంట్స్ సినీ రంగంలో ఉంటాయి. షూటింగ్ స్టార్ట్,ట్రైలర్ విడుదల,సినిమా విడుదల ఇలా అన్నీ సెంటిమెంట్స్ తో ముడిపడి ఉంటాయి. ఇక కొత్తగా ఫీల్డ్ లోకి ఎవరైనా ఎంట్రీ ఇస్తే,తొలి మూవీతోనే క్లిక్ అవ్వాలి. లేదంటే ఇబ్బందే. ఇక హీరోయిన్స్ అయితే ఫస్ట్ సినిమా బ్రేక్ ఇవ్వకపోతే ఛాన్స్ లు కష్టం. కేరీర్ కూడా ఒడిదుడుకులకు గురవుతుంది. అలాగని మొదటి సినిమా హిట్ అయినా సరే కొందరికి ఛాన్స్ లు రావు,వచ్చినా క్లిక్ అవ్వవు. ఇలాంటి భామలు ఎందరో వున్నారు. బెంగాలీ బ్యూటీ తనూరాయ్ పరిస్థితి కూడా అదేవిధంగా తయారయింది.

హీరో రవితేజాతో కల్సి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ తనూరాయ్ ఆ తర్వాత స్టార్ స్టేటస్ తెచ్చుకోవడంలో వెనకబడి పోయింది. అయితే ఆ సినిమాలో నటించిన హీరో రవితేజ మాత్రం అమాంతం దూసుకుపోయాడు. ఆనందం,మనసంతా నువ్వే లాంటి మూవీస్ లో నటించినప్పటికీ సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి గానీ ఈ స్లిమ్ బ్యూటీకి పేరు రాలేదు.

కారణం వీటిల్లో చిన్నపాత్రలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.తనూరాయ్ 1980 డిసెంబర్ 26న కోల్ కత్తాలో పుట్టింది. డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ పూర్తిచేసింది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కంట్లో పడడంతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆతరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ క్లిక్ అవ్వలేదు.

ఇక ఐటెం సాంగ్స్ కి పరిమితం అయిపొయింది. ఇక తెలుగులో ఓ మంజుల కథ అనే సినిమా ఆమె నటించిన చివరి చిత్రం. 2013తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. మలయాళంలో కూడా చిన్న పాత్రలకే పరిమితం కావడంతో టివి సీరియల్స్,డాన్స్ షో ల వైపు మొగ్గు చూపుతోందట