Movies

సన్ ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ యాడ్ లో వచ్చే ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు

చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చేవాళ్లకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండేవాళ్ళు కొందరైతే, అసలు ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అద్భుతంగా తమ ఫెరఫార్మెన్స్ తో కట్టిపడేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో అవంతిక అనే చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న ఈ అమ్మాయి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేస్తోంది. ఈమె పుట్టి పెరిగింది అమెరికాలో అయినా నటన మీద మక్కువతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీ గా ఉంటున్న అవంతికకు పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక కూడా ఉందట. ఏడేళ్ల వయస్సులో కూచిపూడి నృత్యం నేర్చుకున్న అవంతిక లెక్కకు మించి స్టేజ్ షో లు ఇచ్చి తానేమిటో కూడా నిరూపించుకుంది. ఇక నార్త్ ఇండియాలో జి తెలుగు ఛానల్ నిర్వహించిన డాన్స్ షోలో రన్నర్ అప్ గా నిల్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే ఛాన్స్ అవంతిక దక్కించుకుంది. ఆ సినిమాలో తన నటనతో అలరించిన అవంతిక ఆతరువాత ఆక్సిజన్, ప్రేమమ్,రారండోయ్ వేడుక చూద్దాం, మనం ,అజ్ఞాత వాసి,వంటి ఎన్నో మూవీలో నటించింది. ఇంతకీ ఈ అమ్మాయి టివి రంగంలో చేసిన ఓ యాడ్ సంచలనం అయింది.

సన్ ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ యాడ్ లో’అమ్మ చేసింది లైట్ గానే ఉంటుంది’అని చెబుతూ ఈ అమ్మాయి చేసిన డాన్స్ తో ఆలిండియా లెవెల్లో ఈమె పేరు మారుమోగింది. సౌత్ ఇండియా స్పేపింగ్ మాల్, చెన్నై సిల్క్స్,కుమరన్ సిల్క్స్ వంటి పలు యాడ్స్ లో కూడా ఈ పాప స్వేచ్ఛ, ప్రజా హక్కు వంటి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."