Devotional

దసరా నవరాత్రులలో రెండో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

రెండో రోజు – గాయత్రి దేవి అలంకారం

దసరా నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు. గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి. అలాగే సకల వేద స్వరూపిణి. గాయత్రి దేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ఐదు ముఖాలలో ప్రకాశిస్తూ ఉంటారు. ఆమె శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉంటారు. అమ్మ ప్రాత్ణకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజలు చేస్తారు. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. కష్ఠాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారికి పూజ చేసి అల్లపు గారెలను నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా భావించి వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.