Devotional

దసరా నవరాత్రులలో మూడో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

మూడోరోజు – అన్న‌పూర్ణాదేవి అలంకరణ

మన పెద్దవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను వరంగా ప్రసాదిస్తుంది. పరిపూర్ణమైన భక్తితో అన్నపూర్ణాదేవిని పూజిస్తే పోషణ భారం ఆమె వహిస్తుందని చెప్పుతూ ఉంటారు. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరణ చేసి తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.