Movies

ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని సంచలన విషయాలను చెప్పిన తమన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా నటించిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా పై ఇటు సినీ రంగంలో, అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా అభిమానుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేరీలిజ్ వేడుక ఇటీవల జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా తారక్ మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు. అయితే ఓ ఇంటర్యూలో తారక్ గురించి ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తండ్రి హరికృష్ణ మరణంతో కుంగిపోయిన ఎన్టీఆర్ తనను నమ్ముకున్న నిర్మాత నష్ట పోకూడదన్న ఉద్దేశ్యంతో ఐదవ రోజునే షూటింగ్ కి వచ్చేసాడని చెప్పారు.

ఇక ఆడియో వేడుకలో త్రివిక్రమ్ స్పీచ్ కోసం ఆసక్తిగా అందరూ ఎదురు చూసారు. ఎందుకంటే ఆయన స్పీచ్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. అయన మాట్లాడ్డం మొదలుపెడితే ఎక్కడ ఆగుతుందో తెలీదు. కానీ తారక్ కి ఉన్న పరిస్థితులలో ఏదో రెండు నిమిషాల్లో ముగించేశారు. అయితే తారక్ అంతసేపు మాట్లాడతాడని ఊహించలేదు. తారక్ తో పర్సనల్ గా క్లోజ్ గా మూవ్ అవుతాను. తారక్ చూపించే ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది’అని తమన్ వివరించాడు.

నిజానికి తమన్,తారక్ మంచి ఫ్రెండ్స్. ముద్దుగా ఎన్టీఆర్ ని అన్నయ్య అని తమన్ పిలుస్తాడు. మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా ఉన్నప్పటినుంచి తమన్ తో ఎన్టీఆర్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. నిజానికి తమన్ ఓ స్టార్ హీరోకి మ్యూజిక్ అందించే ఘనత తారక్ అందించాడు. తారక్ తాను నటించిన బృందావనం సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ తమన్ కి ఇవ్వడం,అది కాస్తా సూపర్ డూపర్ కావడం జరిగాయి.

అందుకే వీళ్లిద్దరి మధ్యా బంధం మరింత బలపడింది. ఇక వరుస ఛాన్స్ లతో తమన్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. మళ్ళీ త్రివిక్రమ్,తారక్ కాంబినేషన్ లో తొలిసారి వస్తున్న అరవింద సమేతకు మ్యూజిక్ ఛాన్స్ వచ్చింది. మనసు పెట్టి మంచి సంగీతాన్ని తారక్ కోసం తమన్ అందించాడు.ఈ సినిమాలో ఒక్కో పాటకు ఒక్కో రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చి,తాను అన్నయ్య అని పిలిచే తారక్ కోసం కసిగా పనిచేసాడు.

ముఖ్యంగా తండ్రి పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని, ఐదవ రోజునే షూటింగ్ స్పాట్ కి తారక్ వస్తున్నాడని తెల్సి ,యూనిట్ కి ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఎన్టీఆర్ ఎక్కడా బాధపడకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని అందరూ అనుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ సిద్ధం చేసుకుని రేయింబవళ్లు శ్రమించి షూటింగ్ పూర్తిచేయడానికి అందరూ రెడీ అయ్యాం. ఇక తారక్ ఈ సినిమాకు వన్ మేన్ ఆర్మీ’అని తమన్ చెప్పుకొచ్చాడు.