Movies

శోభన్ బాబు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ …నమ్మలేని నిజాలు

ఆ రోజుల్లో అందాల నటుడు అంటే ఠక్కున చెప్పే పేరు శోభన్ బాబు. అందం, అభినయం గల శోభన్ బాబు క్రమశిక్షణకు పెద్దపీట వేసేవాడు. సినిమా వృత్తిని దైవంగా భావిస్తూ ,నిర్మాతలు, దర్శకుల పట్ల గౌరవంగా ఉండేవాడు. అన్నింటికీ మించి అభిమానుల పట్ల ఆప్యాతగా ఉండేవాడు. ఇక మంచి రేంజ్ లో ఉండగానే ఇక నటించకూడదని నిర్ణయించుకుని ఆ విధంగా ఇండస్ట్రీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఏకైక నటుడు కూడా ఆయనే.ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, నటుడిగా ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేసిన శోభన్ బాబు కి మహిళా ప్రేక్షకులు ఎక్కువ ఉండేవారు. నవలా చిత్రాల నాయకుడుగా పేరొందిన శోభన్ బాబు కి అసలు మద్యపానం గానీ, ధూమపానం గానీ అసలు అలవాటు లేదు. యోగా చేసేవాడు.

ఒక్క కాఫీ సేవించే అలవాటు తప్ప మరే అలవాటు లేదు. ఇక ఆ రోజుల్లో ఏదైనా పార్టీకి వెళ్లినా కూడా మద్యం సేవించేవాడు కాదు. కొందరు హీరోయిన్స్ సైతం ఆల్కహాల్ శాతం తక్కువ ఉండే షాంపైన్ ని తాగుతూ, బలవంత పెట్టినా కూడా శోభన్ బాబు అసలు తాగేవాడు కాదని కొంతమంది పలు సందర్భాల్లో చెప్పారు కూడా.

‘నేను ఇప్పటిదాకా ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు. నా జీవన శైలి అలానే ఉంటుంది’అంటూ ఎక్కడైనా ఆల్కహాల్ ఆఫర్ చేస్తే శోభన్ బాబు చెప్పేసేవాడు. ఇక కాఫీ హేబిట్ కూడా ఆయన మానేసుకున్నారు. ఇక ఓసారి విమానంలో హెయిర్ హోస్టెస్ కాఫీ తీసుకు వస్తే,వాసన పీల్చేసి పక్కన పెట్టేసినట్లు ఓసారి శోభన్ బాబు చెప్పుకొచ్చారు.

ఇంతకీ కాఫీ అలవాటు ఎలా మానుకున్నారంటే ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమా షూటింగ్ సమయంలో ఓరోజు ఎవరూ కాఫీ ఇవ్వలేదట. రెండో రోజు కూడా అదే పరిస్థితి వచ్చిందట. దీంతో రెండు రోజులు మానెయ్యగా లేంది, మొత్తం మానేస్తే మంచిది కదా అనుకుని కాఫీ అలవాటు మానుకున్నారట. అలా 45ఏళ్ళనుంచి ఉన్న అలవాటు మానేశారు.