Movies

ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ కొట్టిన సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి . నూనూగు మీసాల వయసులోనే రికార్డుల మోత మోగించిన ఈ హీరో అప్పట్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు . అయితే కొంతకాలంగా హిట్స్ మాత్రమే కొడుతున్నాడు కానీ రికార్డుల దుమ్ము దులిపే హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నాడు . ఆ అవకాశం ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవరూపంలో లభించింది . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత ఎలాంటి రికార్డులు నమోదు చేయనుందో చూడాలి.

ఈరోజు విడుదలైన అరవింద వీర రాఘవ చిత్రానికి ఓవర్ సీస్ లో మంచి ఓపెనింగ్స్ లభించాయి . ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించాడు అరవింద సమేత చిత్రంతో . అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఓపెనింగ్స్ లభించాయి . దసరా సెలవులు ఎన్టీఆర్ కు తోడవ్వడంతో మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ సాధించి భారీ షేర్ లను రాబట్టిన చిత్రాలను ఒకసారి చూద్దామా !

జనతా గ్యారేజ్ – 81.3 కోట్ల షేర్
జై లవకుశ – 75. 34కోట్ల షేర్
నాన్నకు ప్రేమతో – 53. 2 కోట్ల షేర్
బాద్ షా – 48. 04 కోట్ల షేర్
టెంపర్ – 43. 1 కోట్ల షేర్
బృందావనం – 30. 1కోట్ల షేర్
అదుర్స్ – 26. 45 కోట్ల షేర్
యమదొంగ – 35 కోట్ల షేర్
సింహాద్రి – 23. 15 కోట్ల షేర్
ఆది – 24 కోట్ల షేర్
స్టూడెంట్ నెంబర్ 1 – 12 కోట్ల షేర్
ఇక అరవింద సమేత ? ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి .