Movies

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సీక్రెట్ లైఫ్ మీకు తెలుసా?

‘భేటీ బచావో,భేటీ బడావో’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపబడ్డ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ,హిందీ సినిమాల్లో తన సత్తా చాటింది. తన అందచందాలతో కుర్రాకారు మతిపోగొడుతూ అందరినీ అలరిస్తున్న రకుల్ కి మంచు లక్ష్మితో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇక రకుల్ 1990అక్టోబర్ 10న పంజాబీ కుటుంబంలో జన్మించింది. తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ ఆఫీసర్. తల్లి కుల్విందర్ గృహిణి. రకుల్ పేరులో కూడా తల్లీ తండ్రీ ఉంటారు. రకుల్ లో మొదటి అక్షరం ర ను తండ్రి రాజేంద్ర సింగ్ నుంచి, కుల్ అనే పదం తల్లి పేరులోని కుల్విందర్ నుంచి తీసి రకుల్ గా నామకరణం చేశారట.

తండ్రి ఆర్మీలో ఉండడం వలన రకుల్ విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోని ఆర్మీ స్కూల్ లోనే సాగింది. క్రమశిక్షణగా పెరిగింది. చిన్నప్పుడు ఆటలు బాగా ఆడే రకుల్ కి గోల్ఫ్ ఆటను తండ్రి పరిచయం చేసాడు. దీంతో జాతీయ స్థాయికి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రకుల్ చిన్నప్పుడు ఆటలు ఆడడమో,పుస్తకాలు చదవడమే తప్ప టీవీ చూడ్డం నిషిధ్ధంగా ఉండేదట. ఆవిధంగా తండ్రి ఎంతోక్రమశిక్షణతో పెంచారు. జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మాథ్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న రకుల్ స్టడీ అయ్యాక మోడలింగ్ లో అడుగుపెట్టింది.

కొన్ని అందాల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. 18ఏళ్ళ ప్రాయంలోనే మోడలింగ్ లో కాలుమోపిన రకుల్ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో సినిమా వాళ్ళ కళ్ళల్లో పడింది. వికో ప్రకటనలో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2009లో కన్నడ సినిమా ద్వారా వెండితెరమీద మెరిసింది. 2011లో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చిన రకుల్ తల్లిదండ్రులతో కల్సి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. 2016లో ఎఫ్ 45పేరిట సొంత జిమ్ ని ప్రారంభించింది. గుర్రపు స్వారీ అంటే ఎంతోఇష్టపడే రకుల్ ఖాళీ సమయంలో గుర్రపు స్వారీ చేస్తుంది.

కరాటేలో కూడా రకుల్ కి ప్రావిణ్యం వుంది. బ్లాక్ బెల్ట్ సాధించింది. ఇక 30ఏళ్ళ లోపే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న రకుల్,అది కూడా లవ్ మ్యారేజ్ కావాలని కోరుకుంటోంది. సినిమాలో చేరాలనే ఉద్దేశ్యం బలంగా ఉండడంతో భరతనాట్యం తో సహా అన్నింటినీ నేర్చుకుంది. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తున్న రకుల్ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో అలరించబోతోందట.

అన్నింటా ప్రావిణ్యం పొంది మరీ సినిమాల్లోకి వచ్చి, తన నటనతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేస్తోన్న రకుల్ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ వీరాభిమాని. ఒకసారి షారుక్ ఖాన్ ఓ హిందీ సినిమా చేస్తుండగా, ఆ సినిమాలో హీరోయిన్ గా వేస్తున్న రకుల్ తన అభిమాన నటుడు మీద అభిమానం చాటుకుంది.